Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై మల్లు భట్టి కీలక వ్యాఖ్యలు…

కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే ప్రచారం నేపథ్యంలో ముఖ్యమంత్రి అభ్యర్థి పదవిపై ఆ పార్టీ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇటీవల మధిరలో ఎన్నికల సభలో సీఎం చేసిన వ్యాఖ్యలపై భట్టిని దృక్పథం పలకరించగా పై విధంగా స్పందించారు … మధిర ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా ఉంటూనే రాష్ట్రంలోని ఇతర నియోజకార్గలలో ప్రచారానికి వెళ్ళుతున్నారు … ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ విప్ గా ,శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు నిర్వహించిన భట్టి ,తెలంగాణ రాష్ట్ర శాసనసభలో సీఎల్పీ నేతగా వ్యవరించారు . తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతల్లో భట్టి ఒకరుగా ఉన్నారు … రాష్ట్రంలో పీసీసీకి అధ్యక్షుని తర్వాత కీలక బాధ్యతల్లో ఉన్న భట్టి రాష్ట్ర స్థాయిలో తన సమయాన్ని కేటాయిస్తుండగా నియోజకవర్గంలో ఆయన సతీమణి నందిని , కుమారుడు సూర్యవిక్రమార్కు భట్టి లు ప్రచారాన్ని తమ భుజాలపై వేసుకున్నారు …భట్టికి తీసిపోని విధంగా వారు ప్రచారం నిర్వహించడం కాంగ్రెస్ కార్యకర్తలను ఉత్సాహపరుస్తుంది….

తెలంగాణ సంపదను ప్రజలకు పంచాల్సిన అవసరం ఉందని అది జరగడంలేదని భట్టి అన్నారు …సంపద కొంతమంది చేతుల్లోకి పోతుందని ధ్వజమెత్తారు . రాష్ట్రానికి ట్రస్టుగా ఉండాల్సిన పాలకులు సొంతప్రయోజనాలకోసం రాష్ట్రాన్ని తాకపెట్టి ఐదున్నర లక్షల కోట్లు అప్పుచేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారని కేసీఆర్ విధానాలను తూర్పారబట్టారు …
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వంద శాతం అధికారంలోకి వస్తుందని భట్టి పూర్తీ విశ్వాసం వ్యక్తం చేశారు . ముఖ్యమంత్రి ఎవరు అవుతారు …కాంగ్రెస్ పొరపాటుగా గెలిచినా సీఎం పదవి కోసం అరడజను మంది ఉన్నారని , కాంగ్రెస్ లో పట్టి లేని భట్టి ముఖ్యమంత్రి అవుతారా అంటూ కేసీఆర్ హేళనగా మాట్లాడటంపై భట్టి తీవ్రంగా స్పందించారు … ఎవరైనా ముఖ్యమంత్రి పదవి ఆశించడంలో తప్పులేదన్నారు. తమ పార్టీలో ఎన్నికైన ఎమ్మెల్యేల అభిప్రాయాలూ తీసుకొని ప్రొసీజర్స్ ప్రకారం ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారని వివరించారు. అధిష్ఠానం నిర్ణయం మేరకే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎన్నిక ఉంటుందని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2024లో వచ్చే లోక్ సభ ఎన్నికల్లోను కాంగ్రెస్ గెలిచి, ఢిల్లీలో అధికారం చేజిక్కించుకుంటుందని జోస్యం చెప్పారు.

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలు ఆశయాలు నెరవేరలేదని, తాము అధికారంలోకి వస్తే కేసీఆర్ అవినీతిపై దర్యాఫ్తు జరిపిస్తామని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం తీరుతో ప్రభుత్వ వైఫల్యాలు తేలిపోయాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ప్రతి ప్రాజెక్టులోనూ అవినీతి జరిగిందన్నారు. ధరణి దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ధరణిని దోచుకోవడానికే తీసుకు వచ్చారన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ధ్వజమెత్తారు. లక్షల కోట్లు అప్పు చేసి కేసీఆర్ ఏం చేశారు? అని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధే ఇప్పటికీ కనిపిస్తోందన్నారు.

తాను మధిర నియోజకవర్గంలో ప్రజలనే నమ్ముతానన్నారు. కాంగ్రెస్ సునామీలా అత్యధిక స్థానాలు గెలవనుందని జోస్యం చెప్పారు. 70 నుంచి 85 సీట్లలో గెలుస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. ఉచిత విద్యుత్, విద్యుత్ ఉత్పత్తులపై పేటెంట్ హక్కు కాంగ్రెస్ పార్టీదే అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు అదనంగా నాలుగు శాతం విద్యుత్ కేటాయించినట్లు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్ అదనంగా ఒక్క ఎకరాకు అయినా నీళ్లు ఇచ్చారా? అని నిలదీశారు.

మధిరలో తన గెలుపు పై ఎలాంటి సందేహంలేదని గత మూడు పర్యాయాలు ఆదరించిన ప్రజలు ఈసారి మరింత ఆదరణ చూపిస్తున్నారని అందువల్ల 55 వేల ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయమనే విశ్వాసం వ్యక్తం చేశారు …తన హయాంలో గత 15 సంవత్సరాలుగా మధిర నియోజకవర్గంలో 50 వేల కోట్ల నిధులతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశామని తెలిపారు …తనపై ముఖ్యమంత్రి మధిర సభలో చేసిన విమర్శలను ప్రస్తావించగా ,సీఎం తన స్థాయిని దిగజార్చుకొని మాట్లాడుతున్నారని , సీఎం గాని ,మధిరలో పోటీచేసిన అభ్యర్థిగాని మధిర కు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు ..మంచినీటి పథకం రాష్ట్రం ఏర్పడక ముందే ఉందని అన్నారు …రాష్ట్రాన్ని అభివృద్ధి చేశానని చెపుతున్న సీఎం 5 లక్షల కోట్లు అప్పులు చేసిన విషయాన్నీ గుర్తు చేశారు … కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ పథకాలు పక్కాగా అమలు చేస్తామని అన్నారు …మధిర మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు …

Related posts

ప్రొఫెసర్ జయశంకర్‌ను కేసీఆర్ క్షోభపెట్టారు.. ప్రొఫెసర్ కోదండరాం

Ram Narayana

సీఎం రేవంత్ రెడ్డికి కొత్త బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ హైకమాండ్

Ram Narayana

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ

Ram Narayana

Leave a Comment