Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్ మోసం చేశారు: బీజేపీ అధినేత జేపీ నడ్డా

  • కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయమైందని విమర్శలు
  • ఈ పదేళ్లలో కేసీఆర్ కుటుంబమే అభివృద్ధి చెందిందని మండిపాటు
  • దళితబంధులో ప్రజాప్రతినిధులు 30 శాతం కమీషన్ తీసుకున్నారన్న నడ్డా

తెలంగాణ ఉద్యమకారులను ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేశారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. గురువారం ఆయన నిజామాబాద్‌లో నిర్వహించిన సకల జనుల సంకల్ప సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే తెలంగాణ రూపురేఖలు మారిపోతాయన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయమైందని ఆరోపించారు. ఈ పదేళ్లలో ఆయన కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందిందని విమర్శించారు. దళితబంధులో ప్రజాప్రతినిధులు 30 శాతం కమీషన్ తీసుకుంటున్నారన్నారు. 

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను తెలంగాణలో అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. నరేంద్ర మోదీ హయాంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఐదో స్థానానికి ఎగబాకిందన్నారు. గరీబ్ కల్యాణ్ యోజన ద్వారా 80 కోట్లమందికి ఉచిత రేషన్ పంపిణీ చేస్తున్నామన్నారు. కుటుంబ పాలన నుంచి పలు రాష్ట్రాలకు విముక్తి కల్పించామన్నారు. అదే మాదిరి ఇక్కడ కూడా కుటుంబ పాలన నుంచి విముక్తి కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Related posts

ఆ సీట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులపై ఇంకా వీడని సస్పెన్స్!

Ram Narayana

ఆ మెజార్టీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి తప్పుకుంటా: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Ram Narayana

17 లోక్ సభ స్థానాల్లో గెలుపే మా లక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్

Ram Narayana

Leave a Comment