తెలంగాణ రాజకీయ వార్తలు ..

చెప్పుతో కొడతాం… వెళ్లిపోండి అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చేదు అనుభవం

  • రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌పై మహిళల ఆగ్రహం
  • తమ కాలనీలో సమస్యలు తీర్చకుండా ఏ మొహం పెట్టుకొని వస్తున్నారని నిలదీత
  • మహిళల నిరసనతో అక్కడి నుంచి వెళ్లిపోయిన ఎమ్మెల్యే

రాజేంద్రనగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకాశ్ గౌడ్‌కు సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం రాజేంద్రనగర్‌కు వెళ్లిన ఆయనను కొంతమంది మహిళలు అడ్డుకున్నారు. తమ కాలనీలోని సమస్యలు తీర్చలేదని, అలాంటప్పుడు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారని నిలదీశారు. సమస్యలు తీర్చకుండా ఇక్కడకు వచ్చి ప్రచారం చేస్తే చెప్పుతో కొడతాం…. వెళ్లిపోండి అని మండిపడ్డారు. మహిళల నిరసనతో షాకైన ప్రకాశ్ గౌడ్ ప్రచారం చేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Related posts

మేడిగడ్డను పరిశీలించిన రాహుల్‌గాంధీ.. దోపిడీని చూసేందుకే వచ్చానన్న కాంగ్రెస్ అగ్రనేత

Ram Narayana

మా ఎమ్మెల్యే మీ స్టార్ క్యాంపెయినరా?: కాంగ్రెస్‌పై కేటీఆర్ ఘాటు విమర్శలు…

Ram Narayana

పువ్వాడ అజయ్‌ ఒక దుష్టుడు, దుర్మార్గుడు: రేణుకా చౌదరి

Ram Narayana