Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

హైదరాబాద్ లో భారీగా పడిపోయిన చికెన్ ధరలు.. కారణం ఇదే!

  • గత 20 రోజుల్లో 22 శాతం తగ్గిన చికెన్ ధరలు
  • కార్తీక మాసం, అయ్యప్ప దీక్ష నేపథ్యంలో తగ్గిన అమ్మకాలు
  • డిమాండ్ తగ్గి, సప్లై పెరగడంతో ధరల తగ్గుముఖం

హైదరాబాద్ లో మొన్నటి దాకా భారీగా ఉన్న చికెన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. గత 20 రోజుల వ్యవధిలో చికెన్ ధరలు ఏకంగా 22 శాతం తగ్గాయి. నవంబర్ 3న లైవ్ చికెన్ కిలో ధర రూ. 140గా ఉండగా… ఇప్పుడు ధర రూ. 126కు పడిపోయింది. స్కిన్, వితౌట్ స్కిన్, బోన్ లెస్ చికెన్ ధరల్లో కూడా తగ్గుదల ఇదేమాదిరి ఉంది. 

చికెన్ ధరల తగ్గుదలపై ఈగల్ ఫిషరీస్ ప్రొప్రైటర్ సయ్యద్ ఫయీజుద్దీన్ స్పందిస్తూ… చికెన్ కు డిమాండ్ తగ్గి, సప్లై పెరగడంతోనే ధరలు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. అక్టోబర్ 29న కార్తీక మాసం ప్రారంభమయిన సంగతి తెలిసిందే. హిందూ మతానికి చెందిన ఎంతో మంది ఈ మాసాన్ని పవిత్రంగా భావిస్తుంటారు. మాంసాహారానికి దూరంగా ఉంటారు. దీనికి తోడు, లక్షలాది మంది అయ్యప్ప దీక్ష తీసుకుంటుండటంతో… వారు కూడా మాంసాహారానికి దూరంగా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో చికెన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. రాబోయే కొన్ని రోజుల పాటు ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. మరోవైపు, తగ్గిన ధరలతో చికెన్ ప్రియులు పండగ చేసుకుంటున్నారు. అయితే, కార్తీక మాసం ముగిసిన తర్వాత, అయ్యప్ప దీక్షలు ముగిసిన తర్వాత చికెన్ ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉంది.

Related posts

బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్భాటం మాత్రమే చేసింది: మంత్రి పొంగులేటి

Ram Narayana

టి యు డబ్ల్యూ జే (ఐజేయు) రాష్ట్ర మహాసభల వెబ్ సైట్ ని ప్రారంభించిన మంత్రి పొంగులేటి…

Ram Narayana

పాలనలో పట్టుకోసం రేవంత్ అడుగులు… 20 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ

Ram Narayana

Leave a Comment