గుట్టలు దోచుకున్న దొంగల భరతం పడతాం…రఘునాథపాలెం ఎన్నికల సభలో తుమ్మల …
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 కి 10 సీట్లు ఖాయం …
ఖమ్మం సీటుపై పొరుగు రాష్ట్రాల్లో ,విదేశాల్లో బెట్టింగులు
ఆరోగ్యారంటీలపై విస్త్రత చర్చ …అధికారంలో రాగానే అమలు
దొరల చేతుల్లోనుంచి తెలంగాణకు విముక్తి
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గుట్టలు దోచుకున్న దొంగల భరతం పడతామని ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు …శుక్రవారం సాయంత్రం రఘునాథపాలెం మండల కేంద్రమైన రఘునాథపాలెంలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ,ఖమ్మంలో గెలుపు గురించి డౌట్ లేదని అన్ని వర్గాల ప్రజల అండదండలు తనకు ఉన్నాయని తుమ్మల అన్నారు .గతంలోకి కూడా రఘునాథపాలెం తనను ఆదరించి గెలిపించింది అన్నారు ..
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చినందుకు అపూర్వ స్వాగతం పలికిన మీ అందరికీ ధన్యవాదాలు…ప్రజల కోరిక మేరకు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినారు.
ఇచ్చిన తెలంగాణలో కొంతమంది దొర్లపాలు అయ్యింది, దోపిడి పాలయింది, ప్రజాధనాన్ని వారి సంపాదన కోసం, స్వార్థం కోసం వాడుకుంటున్నారు…తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి అల్లర్లు లేని రాష్ట్రంగా ప్రశాంతమైన రాష్ట్రంగా ఉంచడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ప్రభుత్వ సొమ్మును పేదలకే పంచే విధంగా చేస్తామని సోనియా గాంధీ అన్నారు….బడా బాబులు,దొరలు, బడా వ్యాపారస్తులు, దోచుకున్న తెలంగాణ సొమ్ముని కక్కించి పేదలకే పంచుతానని సోనియా గాంధీ అన్నారు….మొట్టమొదటి ఇందిరమ్మ కాలనీ ఖమ్మం నియోజకవర్గం లో రఘునాథపాలెం కె వస్తుందని అన్నారు…
ఇందిరమ్మ ఇచ్చిన అసైన్డ్ భూములు ఎవరైనా కాజేసి ఉంటే కలెక్టర్ని తీసుకొచ్చి మీ భూములు మీకు ఇప్పించే బాధ్యత మాది అని అన్నారు…ఈ గ్రామం నాకు ఇష్టమైన గ్రామం 2009లో 1600 ఓట్ల మెజార్టీ ఇచ్చి నన్ను ఎమ్మెల్యే ని చేశారు…సాగు నీటి కష్టాలు దూరం చేయాలని బుగ్గ వాగు చెక్ డ్యాం నిర్మాణం చేశా..బుగ్గ వాగు కాలువ లు కమీషన్ల కోసం తవ్వకుండా వదిలేశారు…బీ.టీ రోడ్లు వేశాం గ్రామాలను అభివృద్ధి బాట పట్టించాం
దౌర్జన్యం అరాచకం గుట్టలు తవ్వుకునే దందా లేకుండా తరమి కొట్టాలి..తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ పది పదికి సీట్లు గెలవ బోతున్నాం..ఖమ్మం ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారని ఏలూరు నెల్లూరు ఇతర రాష్ట్రాల వారు వచ్చి తెలుసుకుంటున్నారు…అరాచకం అవినీతి నీ ఖమ్మం ప్రజానీకం తరమి కొట్టి కాంగ్రెస్ పార్టీ నే గెలిపిస్తారని ఇతర రాష్ట్రాల్లో బెట్టింగ్ లు
కాస్తోన్నారంట..జానారెడ్డి మంత్రి గా ఉన్నపుడు రఘు నాథ పాలెం మండలం నేనే ఏర్పాటు చేశా…కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలలో పేద ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు నల్లమల్ల వెంకటేశ్వర్లు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మానుకొండ రాధా కిషోర్ తో పాటు మండల కాంగ్రెస్ టిడిపి సిపిఐ పార్టీల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.