-ఇకపై ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు
-బ్యాంకర్ల కమిటీ వెల్లడి
-నిన్న లాక్ డౌన్ పొడిగించిన సర్కారు
-ప్రజా కార్యకలాపాల సమయం పొడిగింపు
తెలంగాణలో నిన్న లాక్ డౌన్ 10 రోజుల పాటు పొడిగిస్తూ, ప్రజా కార్యకలాపాల సమయం పొడిగించిన సంగతి తెలిసిందే. ప్రజల కార్యకలాపాల సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పెంచారు. ఈ క్రమంలో రాష్ట్రంలో బ్యాంకుల పనివేళలు కూడా మారాయి. బ్యాంకులు ఇకపై ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తాయి. ఈ మేరకు రాష్ట్ర బ్యాంకర్ల కమిటీ వెల్లడించింది. ఇంతకుముందు, లాక్ డౌన్ సడలింపు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే ఉండగా… బ్యాంకులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకే పనిచేశాయి. తాజా సడలింపుల నేపథ్యంలో బ్యాంకుల పనివేళలు కూడా మారాయి.