సండ్ర గెలుపు కోసం సత్తుపల్లిలో గులాబీ కవాతు …
గులాబి దండుతో దద్దరిల్లిన సత్తుపల్లి.
అడుగడుగునా అభిమాన నేతకు బ్రహ్మరథం పట్టిన అశేష ప్రజానీకం.
గులాబీ పూలవర్షంలో తడిసి ముద్దయిన సత్తుపల్లి.
సత్తుపల్లిని జిల్లా చేసి ఈ గడ్డ రుణం తీర్చుకుంటా
బీఆర్ యస్ ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య
గత పదిహేను ఏండ్ల కిందట సత్తుపల్లి నియోజకవర్గం ఎలా ఉంది..ఇప్పుడు ఎలా ఉంది సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలు ఆలోచించుకోవాలని సండ్ర వెంకట వీరయ్య అన్నారు – సోమవారం సత్తుపల్లి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన భారీ ఎన్నికల ప్రచార ప్రదర్శనలో పాల్గొన్నారు…ఆయనతోపాటు ఎంపీ బండి పార్థసారధి రెడ్డి , మాజీమంత్రి సంభాని చంద్రశేఖర్ లు ఈర్యాలీలో పాల్గొన్నారు … పదిహేను ఏండ్లుగా నేను ఎవర్ని బెదిరించలేదు..ఎవరిపై అక్రమ కేసులు పెట్టలేదు.. మీకుటుంబంలో ఒకడిగా..మీ ఇంటి పెద్దకొడుకుగా సేవ చేశాను ,మరోసారి అవకాశం ఇస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని వెంకటవీరయ్య అన్నారు …నియోజకవర్గంలో ప్రతి ఊరిలో గల్లీ గల్లీకి సీసీ రోడ్లు వచ్చాయి.. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా తాగునీళ్లు వచ్చాయి..పేదింటి ఆడబిడ్డ పెండ్లికి కళ్యాణ లక్ష్మీ కింద లక్ష రూపాయలు వస్తున్నాయి..గర్భిణీ మహిళలకు కేసీఆర్ కిట్లు ఇచ్చిన విషయాన్నీ ఆయన గుర్తు చేశారు …రైతుబంధు కింద ఎకరాకు పదివేలు ఇస్తున్నాము…రైతు చనిపోతే ఆ రైతన్న కుటుంబానికి ఐదు లక్షల బీమా ఇస్తున్నాం… తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకుందామని అన్నారు ..
నియోజకవర్గ ప్రజలు సమస్యలు అని వస్తే ఏ అధికారి దగ్గరకెళ్తే పని అవుతుందో నాకు తెల్సు..నియోజకవర్గంలోని ప్రతి ఊరి సరిహద్దులు తెలుసు…కొత్తగా వచ్చినవాళ్లకు కనీసం సరిహద్దులు తెలియదు.. వాళ్లను నమ్ముకుంటే ఆగమే..నేను గెలిస్తే నేనోక్కడ్నే ఎమ్మెల్యే..అదే కాంగ్రెస్ గెలిస్తే ఊరికో మండలానికో ఎమ్మెల్యే ఉంటరు.. సత్తుపల్లిని జిల్లాను చేసి ఈ నేల రుణం తీర్చుకుంటా.. పది జిల్లాలగా ఉన్న తెలంగాణను ముప్పై మూడు జిల్లాలు చేసిన కేసీఆర్ గారు నేను గెలిస్తే సత్తుపల్లిని ముప్పై నాలుగో జిల్లా చేస్తారు…అందుకే నవంబర్ ముప్పైన జరగనున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కేసీఆర్ ను మూడవసారి ముఖ్యమంత్రి ని చేసుకుందామని అన్నారు ..