కాంగ్రెస్ ,కేసీఆర్ ఇద్దరు ఒక్కటే …తెలుగులో ప్రధాని మోడీ ..
తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం …
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది
బీఆర్ యస్ నేతల అవినీతిపై విచారణ జరిపిస్తాం
కాంగ్రెస్ , బీఆర్ యస్ కుటుంబ పార్టీలు
కాంగ్రెస్ ,కేసీఆర్ ఇద్దరు ఒక్కటే , తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ప్రధాని మోడీ తెలుగులో మాట్లాడటం ప్రజల్లో ఆసక్తిని కలిగించింది….నా ప్రీయమైన కుటుంబసభ్యులారా …అంటూ పదే …పదే ఆయన తెలుగులో సంబోధించడం కూడా సభికులను ఆకట్టుకుంది …అంతే కాకుండా ప్రసంగం మధ్యలో తెలుగు పదాలను వత్తి వత్తి పలికి ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేశారు ప్రధాని …రెండు రోజులుగా రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్న ప్రధాని సోమవారం మహబూబాబాద్ , కరీంనగర్ , ఎన్నికల సభల్లో పాల్గొన్న ప్రధాని , సాయంత్రం హైద్రాబాద్ లో నిర్వహించిన భారీ రోడ్ షో లో పాల్గొన్నారు … తెలంగాణ లో బీజేపీ అధికారంలోకి వస్తుందని బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రధాని పలు సభల్లో అన్నారు … కాంగ్రెస్ , బీఆర్ యస్ లు కుటుంబపార్టీలని వారికి ఓటు వేస్తె అభివృద్ధి జరగదని అన్నారు .. నీళ్లు , నిధులు ,నియామకాలు అన్న కేసీఆర్ రాష్ట్రంలో ఉద్యోగులు ఇవ్వకపోయినా తమ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారని దుయ్యబట్టారు …బీఆర్ యస్ కు ఓట్లు వేస్తె రాహుల్ బాబా ను ప్రధాని చేస్తారని విమర్శలు గుప్పించారు ..రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దోపిడీ చేసిన కేసీఆర్ కు ఓటు వేయడమంటే దోపిడీకి ఓటు వేసినట్లునని ప్రధాని హెచ్చరించారు …కాంగ్రెస్ గ్యారంటీలు , కేసీఆర్ సంక్షేమం నమ్మదగ్గవి కావని , మోడీ ఒక్క సారి గ్యారంటీ అంటే గ్యారంటీగా అమలు జరుగుతుదని అది ఒక నమ్మకం, భరోసా అని ప్రజలకు విశ్వాసం కల్పించే ప్రయత్నం చేశారు …
హైద్రాబాద్ లో ప్రధాని మోడీ భారీ ర్యాలీ …
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ హైద్రాబాద్ లో భారీ ర్యాలీ నిర్వహించారు …కరీం నగర్ సభ ముగించుకొని హైద్రాబాద్ చేరుకున్న ప్రధాని ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి కాచిగూడ వరకు రెండున్నర కిలోమీటర్లు మేర రోడ్ షో నిర్వహించారు …ప్రజలు భారీ సంఖ్యలు పాల్గొన్నారు …ప్రధాని వారికీ అభివాదం చేస్తూ ముందుగు సాగారు …ప్రచాని వెంట ఓపెన్ టాప్ వాహనంలో కేంద్రమంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి , ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ పాల్గొన్నారు …