Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనంలో బీఆర్ యస్ కొట్టుకొని పోవడం ఖాయం..పొంగులేటి,తుమ్మల ,సిపిఐ నారాయణ …

తెలంగాణ రాష్ట్రంలో అడ్డదారిలో అధికారంలోకి వచ్చేందుకు ఆపద్ధర్మ ప్రభుత్వం అరాచకాలు, దోపిడీలు, దౌర్జన్యం చేస్తుందని కేవలం కాంగ్రెస్​ అభ్యర్థుల ఇండ్లపైన మాత్రమై ఐటీ పేరుతో దాడులు చేస్తుందని దీనిని ప్రజలు సహించరని ఓటు ఆనే ఆయుధంతో బుద్ధిచెప్పాల్సిన సమయం అసన్నమైందని పాలేరు బీఆర్​ఎస్​ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావులు అన్నారు. మంగళవారం రూరల్​ మండలం సాయిగణేష్​ క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రభంజన రాబోతుందని అది కాంగ్రెస్​కు అనూకలంగా ఉంటుందన్నారు. రాబోవు ఫలితాలు ఒకవైపే ఉంటాయని ఇందులో ఎటువంటి సందేహంలేదన్నారు. అన్ని వర్గాల వారు కాంగ్రెస్ ను గెలిపించడానికి ముందుకు వచ్చారని ఇది మంచి పరిణామం అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కలలు ప్రజలు నెరవేర్చందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అవినీతి, అక్రమాలకు నిలయంగా తెలంగాణ ప్రభుత్వం మారిందన్నారు. ప్రాజెక్టు లలో ఏం జరుగుతుందో ప్రజలు గమనించినట్లు తెలిపారు. కాళేశ్వరం పేరుతో లక్షల కోట్లు దోచుకున్న చరిత్ర కల్వకుంట్ల కుటుంబానికి ఉందన్నారు. అధికారంలో వచ్చిన వెంటనే దోచుకున్న సొమ్మును వెలికితీసి సంక్షేమం కోసం ఖర్చు చేస్తామన్నారు. కాంగ్రెస్​ మ్యానిఫెస్టో ప్రకటన ప్రకారం ఆరు గ్యారంటీలను అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే అమలు చేసే బాధ్యత మాది అన్నారు. భారతదేశంలో అత్యంత దనవంతమైన ముఖ్యమంత్రి మరోక లేరన్నారు. జిల్లాలో పదికి పది సీట్లు 9 కాంగ్రెస్​, ఒక్కటి సీపీఐ గెలవబోతుందన్నారు. లిక్కర్ కేసులో కవితను తప్పించేందుకు కేసీఆర్ అంతర్గతంగా బీజేపీతో దోస్తి కట్ట్టినట్లు తెలిపారు. కుటుంబ పాలనను వ్యతిరేకించడం కోసమే మేము కాంగ్రెస్ పార్టీలోకి వచ్చామన్నారు.అక్టోబర్ 26 నకేంద్ర ఎన్నికల కమిషన్ దగ్గరకు వెళ్లి రైతుబంధు కార్యక్రమన్ని నోటిఫికేషన్ రాకముందే ఇవ్వాలని రిప్రజెంటేశన్ ఇచ్చామని హరిష్​రావు నొటి దురుసు వలనే రైతుబందును ఈసీ నిలిపివేసిందన్నారు.పచ్చి అబద్దాలు చెప్పే బీఆర్​ఎస్​ నాయకులు కాంగ్రెస్ రైతు బంధు ఇచ్చే దాంట్లో వ్యతిరేకం అని అభూత కల్పనలు సృష్టించారని తెలిపారు. ః సొల్లు కోసం ప్రజలను మభ్య పెట్టడం కోసం కరెక్ట్​ కాదన్నారు. మీ దీవెనలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫస్ట్ క్యాబినెట్ లో రైతు భరోసా 7,500 డిసెంబర్ చివరి కల్లా కాంగ్రెస్ పార్టీ జమచేస్తుందన్నారు.రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ కరెంట్ గురించి మాట్లాడిన మాటలు వక్రీకరించారు.ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్ మీద మొదటి సంతకం చేశారని స్పష్టం చేశారు. 24గంటలు ఉచిత కరెంట్​ ఇచ్చుడు ఇచ్చుడే అన్నారు. ఉచిత విద్యుత్​ అనేది కాంగ్రెస్​ పెటెంట్​ హక్కులాంటిదన్నారు.కర్ణాటక లో కాంగ్రెస్ నాలుగు గ్యారెంటీ లు అమలు చేస్తుందన్నారు.తెలంగాణ ప్రజల సొమ్ము ఒక లక్ష ముప్పై వేల కోట్లు ముక్కుపిండి డబ్బులు వసూలు చేసి ఆరు గ్యారెంటీ లు చేస్తాం అన్నారు.మాయమాటలు, మోసపూరిత మాటలు ప్రజలు నమ్మరు, మీ రాజకీయ జీవితం సమాధి కాబోతోందన్నారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది గెలవబోతున్నాం అని స్పష్టం చేశారు. ముప్పై అరుగంటల టైం ఉంది ఏం జిమ్మిక్కులు చేసుకుంటారో చేసుకోండి…ఖమ్మం జిల్లా ప్రజలకు ఒక క్లారిటీ ఉందన్నారు.పాలేరు, ఖమ్మం నియోజకవర్గంలో అనేక శక్తి యుక్తులను వాడారు. మాకు మద్దతు ఇచ్చే వారిని అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు.ఎన్ని ఇబ్బందులు పెట్టినా పాలేరు ప్రజలు ప్రజల మనిషిని ఎన్నుకోబోతున్నారని తెలిపారు. కొంతమంది పోలీసు అధికారులు తమ పరిధిదాటి పనిచేస్తున్నారని వారికి కూడ సమయం వచ్చినప్పుడు సరైనరితీలో బుద్దిచెబుతామన్నారు. కొన్ని శక్తులు కూనంనేని ని ఓడించాలని పగటి కలలు కంటున్నారని 25వేల మోజార్టీతో కూనంనేని గెలవబోతున్నట్లు తెలిపారు. బీఆర్​ఎస్ పార్టీ అరాచకాలు, దోపిడీ పలితమే డిసెంబర్ మూడున రాబోతున్న ఫలితాలు అన్నారు. తొమ్మిదిన్నరు సంవత్సరాలు మీరు కష్టాలు అనుభవించారు.మరో మూడు రోజుల్లో మీ కష్టాలు తీరుతాయి…ప్రజల ఆశీర్వదం మాకు అందిస్తున్నరు,మాకు ఊహించని రీతిలో గెలుపు బాటలు వేశారు అందుకు ఈ జిల్లా ప్రజలకు రుణపడి ఉంటామన్నారు. మా మీద నమ్మకం ఉంచి మంచి మోజార్టీతో గెలిపిస్తునందుకు మీ నమ్మకాన్ని సైతం నిలబేడతమన్నారు. అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తామన్నారు.అసెంబ్లీలో మీ గౌరవాన్ని నిలుపుతాం ,దేశంలో ఇండియా కూటమిలో ఉన్న సీపీఐ మాకు మద్దతు తెలిపింది వారికి కూడ కృతజ్ఞలు తెలుపుతున్నట్లు తెలిపారు. పాలేరు, ఖమ్మంలో కేసీఆర్​ వందల కోట్లు అక్రమ డబ్బుతో ఓటర్లను కొనుగోలు చేయడమే కాకుండా భయబ్రాంతులకు గురిచేస్తున్నాడని విమర్శించారు.

మీడియా సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ …
దేశంలో బీజేపీ లాంటి ప్రమాదకర పార్టీ ఉందని దానిని అంతమోందించేందుకు కాంగ్రెస్తో దోస్తికట్టినట్లు సీపీఐ జాతీయ నాయకుడు నారయణ అన్నారు. ఖమ్మంలో పొంగులేటి నామినేషన్ ను కూడా అడ్డుకోవాలని చూసారని, గెలుపును ఎవరు అపలేరన్నారు. వివేక్ పై వేల కోట్ల రూపాయలు మార్చడని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్రమ కేసులు పెట్టినట్ల తెలిపారు. నగరానికి చెందిన ప్రముఖ వైద్యడు ఎమ్ ఎఫ్ గోపీనాద్ పై మరణాయుదాల కేసు పెట్టారని ఇది దారుణమైన విషయం అన్నారు. కక్ష సాధింపు చర్యలకు కేసీఆర్ పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ తిన్న సొమ్ము కక్కించకుండా ఏం చేస్తుందన్నారు. బీఆర్​ఎస్​, బీజేపీలు రెండు ఒక్కటేనన్నారు.మతోన్మాద పార్టీకి మద్దతు తెలిపే పార్టీలు పోవడం వలనే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చామన్నారు.రాహుల్ గాంధీ తాతలు దేశానికి ఎంతో సేవ చేశారన్నారు.రాహుల్ గాంధీకి నిలువ నీడ లేకుండా చేసిన దుర్మార్గుడు మోడీ అని దుయ్యబట్టారు.కేసీఆర్ సంపద ప్రజలకు కాదు,కల్వకుంట్ల కుటుంబానికే అన్నారు. అన్ని వర్గాల ప్రజల కేసీఆర్ పై వ్యతిరేకంగా ఉన్నారన్నారు.కాంగ్రెస్ గెలుపు తథ్యం అన్నారు. ఖమ్మంలో తులసి వనంలో గంజాయి మొక్క అని పువ్వాడ అజయ్​ను ఉద్ధేశించి విమర్శించారు. దుర్మర్గాపు పాలన నుంచి ఖమ్మం ప్రజలు విమూక్తి పొందనున్నారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో టీపీసీసీ సభ్యుడు రాయల నాగేశ్వర్రావు, యూత్​ కాంగ్రెస్​ నాయకులు రాంరెడ్డి చరణ్​రెడ్డి, సీపీఐ జిల్ల కార్యదర్శి పోటు ప్రసాద్​, మహ్మద్​ మౌలానా, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు, సీపీఐ, వైఎస్​ఆర్టీపీ ఇతర పార్టీలకు చెందిన నాయకులు ఉన్నారు.

Related posts

బీఆర్ యస్ ఖాళీ అవుతుంటే కేసీఆర్ తట్టుకోలేక పోతున్నారు …డిప్యూటీ సీఎం భట్టి

Ram Narayana

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకే మన మద్దతు: ఎమ్మార్పీఎస్ మంద కృష్ణ మాదిగ లేఖ

Ram Narayana

కేసీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన …ప్రసంగాలపై భట్టి ఫైర్ …బీఆర్ యస్ కు సింగిల్ డిజిట్ అంటూ కౌంటర్ ఎటాక్!

Ram Narayana

Leave a Comment