- అనుమతి పొందిన ప్రకటనలకు ప్రింటి మీడియాలో అవకాశం
- టీవీలు, రేడియోలు, కేబుల్ నెట్ వర్క్‌లలో ప్రచారం చేయవద్దన్న ఈసీ
- ఓటరు స్లిప్పులపై పార్టీ గుర్తులు ఉండవద్దన్న వికాస్ రాజ్
ఎన్నికల ప్రచార గడువు ముగియడంతో సోషల్ మీడియాలో కూడా ఎన్నికల ప్రచారం చేయవద్దని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… అనుమతి పొందిన ప్రకటనలకు ప్రింట్ మీడియాలో అవకాశముందన్నారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వాటిని ప్రదర్శించవద్దని స్పష్టం చేశారు. టీవీలు, రేడియోలు, కేబుల్ నెట్ వర్క్‌లలో ఎన్నికల ప్రచారం చేయవద్దన్నారు. ఓటరు స్లిప్పులపై పార్టీల గుర్తులు ఉండవద్దని స్పష్టం చేశారు.
ఇక పోలింగ్ ముగిసిన అర్ధగంట వరకు ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించవద్దని తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న దాదాపు లక్షన్నర మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసినట్లు వెల్లడించారు. 27,094 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లో 7,571 ప్రాంతాల్లో బయట కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ కేంద్రంలోకి గుర్తింపు కార్డు తప్ప… సెల్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకు వెళ్లరాదన్నారు. తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.737 కోట్ల విలువైన నగదు.
తెలంగాణలో ముగిసిన ప్రచారం… 144వ సెక్షన్ అమల్లోకి వచ్చిందన్న సీపీ సందీప్ శాండిల్య
- 30వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు అమలులో ఉంటుందని వెల్లడి
- కల్లు, మద్యం దుకాణాలు మూసివేయాలన్న సందీప్ శాండిల్య
- ఎక్కడా ఐదుగురికి మించి గుమికూడదని స్పష్టీకరణ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసిన నేపథ్యంలో హైదరాబాద్‌లో 144వ సెక్షన్ అమలులోకి వచ్చినట్లు సీపీ సందీప్ శాండిల్య చెప్పారు. నేటి సాయంత్రం నుంచి పోలింగ్ జరిగే 30వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఇది అమల్లో ఉంటుందని వెల్లడించారు. కల్లు, మద్యం దుకాణాలు మూసివేయాలని తెలిపారు. ఎక్కడా ఐదుగురికి మించి గుమికూడవద్దన్నారు. పోలింగ్ ముగిసేవరకు 144వ సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. ఈ మేరకు మూడు కమిషనరేట్ల కమిషనర్లు ఆదేశాలు జారీ చేశారు.