Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

పువ్వాడ అజయ్ విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం నగరంలో భారీ బైక్ ర్యాలీ ..

ఖమ్మం నియోజకవర్గం నుంచి బీఆర్ యస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న పువ్వాడ అజయ్ విజయాన్ని కాంక్షిస్తూ మంగళవారం ఖమ్మం నగరంల భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు …
పెవిలియన్ గ్రౌండ్ నుండి ప్రారంభం అయి జెడ్పీ సెంటర్, బొనకల్ క్రాస్ రోడ్, ముస్తఫా నగర్, చర్చ్ కాంపౌండ్, ప్రకాష్ నగర్, గాంధీ చౌక్, శివాలయం రోడ్, జూబ్లీ క్లబ్, బస్ డిపో రోడ్, రాపర్తి నగర్, ఎన్టీఆర్ మార్గ్, మీదగా ఇల్లందు సర్కిల్, మీదుగా ఇందిరా నగర్ సర్కిల్ మమత రోడ్ నుండి మమత ఆసుపత్రికి చేరుకుంది ….అక్కడ ర్యాలీ లో పాల్గొన్న వారిని ఉద్దేశించి ఎంపీ నామ , అభ్యర్థి పువ్వాడ ప్రసంగిస్తూ ప్రత్యర్థులకు గుండెలదిరేలా మోటార్ సైకిల్ ర్యాలీ అద్భుతంగా నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు … ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు …ర్యాలీలో ప్రారంభం అపుడు ఎంత మంది ఉన్నారో చివరి వరకు అంతే మంది పట్టుదలతో పాల్గొనడం విశేషం అన్నారు …ఎవడో నా వాయిస్ తో సూట్కేస్ కు ఓటు వేయాలని చెప్తున్నాడు. వాడికి 3వ తారీకు ప్రజలు సమాధానం చెప్తారని అన్నారు .అజయ్ అన్న గెలుపును ఎవ్వరు అడ్డుకోలేరని అందరికీ అర్థమయ్యేలా ఈ నెల 30వ తేదీన ప్రజలు సమాధానం చెపుతారని అన్నారు …అజయ్ అన్న గెలుపుతో నవ శకానికి నాంది కావలి.. ప్రత్యర్థులు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలను ప్రజలు గమనిస్తున్నారని ఖమ్మం ప్రజలు వాటిని తిప్పి కొడతారని ఆశాభావం వ్యక్తం చేశారు …30వ తేదీన మన వేలుకు ఇంకు.. 3వ తేదీన ఖమ్మం మొత్తం పింకు అంటూ ఉత్సహపరిచారు ..బీఆర్ యస్ గెలుపు కోసం ప్రతి ఒకరు శక్తివంచన లేకుండా పని చేసి అజయ్ అన్న కారు గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ..

Related posts

ఖమ్మంలో జన భోజనాలకు విశేష స్పందన …

Ram Narayana

బీ.అర్.ఎస్ పార్టీకి షాక్..రఘునాథపాలెం సర్పంచ్ పార్టీకి గుడ్ బై…

Ram Narayana

ఖమ్మంలో కలిసిన మంత్రులు …కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం సమిష్టి వ్యూహం దిశగా అడుగులు…

Ram Narayana

Leave a Comment