- కూసుమంచి జిల్లాలో ఘటన
- మైదానంలో కుప్పకూలిన విజయ్ అనే యువకుడు
- గుండెపోటుతో మృతి చెందినట్లు ప్రకటించిన వైద్యులు
ఖమ్మం జిల్లాలో ఓ యువకుడు క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయాడు. దీంతో అతనిని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. అతడు గుండెపోటుతో మరణించినట్లుగా వైద్యులు ప్రకటించారు. జిల్లాలోని కూసుమంచి మండల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతోంది.
ఈ టోర్నమెంట్‌లో విజయ్ అనే యువకుడు ఒక్కసారిగా మైదానంలో పడిపోయాడు. దీంతో నిర్వాహకులు అతనిని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు గుండెపోటు కారణంగా మృతి చెందినట్లు తెలిపారు. దీంతో టోర్నమెంట్ ప్రాంగణంలో విషాదఛాయలు అలుముకున్నాయి.