Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి ఎవరు …? రేవంత్ రెడ్డి ,భట్టి పేర్ల పరిశీలన …!

తెలంగాణాలో దాదాపు కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని ఒకటి అరా మినహా అన్ని సర్వేలు ఎగ్జిట్ పోల్స్ లో చెప్పాయి… రాష్ట్రంలో వాతావరణం కూడా అదే విధంగా ఉందని వివిధ జిల్లాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది…అయితే ఇంతకీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎవరు …? అరడజను మందికి పైగా తమకే కావాలని కోరుతున్నారు …అందులో ఫ్రంట్ లైన్ రన్నర్స్ గా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి , సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఉన్నారు …ఎవరికీ వారు తమకే ముఖ్యమంత్రి అవకాశం ఉంటుదండి నమ్మకంతో ఉన్నారు …ఆదుకు అనుగుణంగా పావులు కదుపు తున్నారు .అయితే గెలిచిన ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది ఎవరిని తమ లీడర్ గా ఎన్నుకుంటారు అనేది ఆసక్తిగా మారింది … కాంగ్రెస్ కు 70 పైగా సీట్లు వస్తాయని అంచనాల నేపథ్యంలో ముందుగా గెలిచినా అభ్యర్థులను క్యాంపు పెట్టి వారితో అధిష్టానం నుంచి వచ్చిన నేతలు సమావేశం అవుతునారు ..ఒక్క ఎమ్మెల్యే నుంచి అభిప్రాయం సేకరణ చేస్తారు …

రేవంత్ పీసీసీ చీఫ్ గా పార్టీని విజయ పథంలో నడిపించారని పేరుంది …ఎన్నికల్లో ఆయన సభలకు ప్రజలు కూడా తరలి వచ్చారు ..అధికార బీఆర్ యస్ కు తీసిపోని విధంగా సభల్లో పాల్గొన్నారు …రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకోని రావాలనే పట్టుదలతో రాష్ట్రంలో పర్యటనలు చేశారు …అదే విధంగా పార్టీకి నూతన జవసత్వాలు తీసుకోని వచ్చేందుకు భట్టి తన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ శ్రేణులను కదిలించారు .. ఉత్తర తెలంగాణ లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు అయిందన్న సందర్భంలో భట్టి నిర్వహించిన పాదయాత్ర పార్టీకి బలం చేకూర్చింది … ప్రధానంగా బడుగు బలహీనవర్గాలను కదిలించింది.. 13 వందల కిలోమీటర్లు మండుటెండలో నిర్వహించిన పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది … సీఎల్పీ నేతగా శాసనసభలో భట్టి పార్టీ వాణిని వినిపించి శహబాస్ అనిపించుకున్నారు … సోనియా దయఉంటే తాను సీఎం అవుతానని కోమటిరెడ్డి ఇటీవల కాలంలో వ్యాఖ్యానించారు …ఉత్తమ్ కుమార్ రెడ్డి , జీవన్ రెడ్డి , శ్రీధర్ బాబుల పేర్లు ప్రచారం లో ఉన్నాయి….

కాంగ్రెస్ కు పూర్తీ మెజార్టీ వస్తే ఇబ్బంది ఉండదు … బొటాబొటిగా వస్తే కొందరిని ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉందనే నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం చర్యలు చేపట్టింది… కొద్దీ గొప్ప సీట్లు తక్కువపడితే కాంగ్రెస్ తో కలిసే వారు ఎవరు అనేది కూడా పరిశీలన చేస్తున్నారు .. …అందువల్ల తక్కువ వచ్చిన సందర్భంలో ఎమ్మెల్యేలు చేజారిపోకుండా బెంగుళూర్ క్యాంపు కు తరలించాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం … పార్టీ నుంచి గెలిచిన సభ్యులు మరో పార్టీల చేరితే వారి ఇళ్లముందు ధర్నా చేస్తామని ప్రొఫెసర్ కోదండరాం హెచ్చరించారు ….

ఇరు గాక ఉత్తమకుమార్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,శ్రీధర్ బాబు , లాంటి వారి పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి … ముఖ్యమంత్రి ఎంపిక అధిష్టానానికి సవాల్ గా మారె అవకాశం ఉంది … ఎగ్జిట్ పోల్స్ ప్రకారం నిజంగా కాంగ్రెస్ కు మెజార్టీ వచ్చి సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో ఏమి జరుగుతుందో చూడాలి మరి …!

Related posts

తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.. ఈ పార్టీకి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం: వైఎస్ షర్మిల

Ram Narayana

అభ్యర్థులను అధిష్ఠానమే ఫైనల్ చేస్తుంది: రేవంత్ రెడ్డి

Ram Narayana

ఖమ్మం ఎంపీ సీటు ఇప్పించండి …సీఎం రేవంత్ ని కలిసి కోరిన విహెచ్

Ram Narayana

Leave a Comment