Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

తెలంగాణ లో కాంగ్రెస్ హవా …63 కాంగ్రెస్ 39 బీఆర్ యస్ నిజమవుతున్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు…

తెలంగాణ శాసనసభ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది … ఒకటి రెండు రౌండ్లు పూర్తీ అయ్యేసరికి కాంగ్రెస్ 63 సీట్లు ,బీఆర్ యస్ కు 39 సీట్లు తో ఉంది..ఇక బీజేపీ 9 చోట్ల ,ఎంఐఎం …ప్రస్తుతం అందుతున్న ట్రెండ్స్ ను బట్టి కాంగ్రెస్ హవా కొనసాగుతుంది..ఖమ్మం , నల్గొండ , వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం కొనసాగుతుంది…ఇదే రీతిన ఫలితాలు ఉంటె కాంగ్రెస్ కు 75 నుంచి 85 సీట్లలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.. కాంగ్రెస్ పార్టీ హేమాహేమీలు రేవంత్ రెడ్డి , భట్టి విక్రమార్క , కోమటిరెడ్డి వెంకట రెడ్డి ,ఉత్తమ్ కుమార్ రెడ్డి , తుమ్మల నాగేశ్వరరావు , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , షబ్బీర్ అలీ , దుద్దిళ్ల శ్రీధర్ బాబు , జీవన్ రెడ్డి , పొన్నం ప్రభాకర్ , కూనంనేని సాంబశిరావు (సిపిఐ )స్పష్టమైన మెజార్టీతో కొనసాగుతున్నారు …విశేషమేమంటే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై కామారెడ్డి లో పోటీచేయగా మొదటి రెండు రౌండ్లలో ఆధిక్యంలో ఉన్నారు ..కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఇక లాంఛనమే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి ..

ఇప్పటి వరకు అందిన సమాచారాన్ని బట్టి ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యేలా ఉన్నాయి. అంచనాలకు మించి కాంగ్రెస్ అభ్యర్థులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఏకమొత్తంగా కాంగ్రెస్ లీడింగ్‌లో ఉంది. బీఆర్ఎస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది . కామారెడ్డిలో వెనకబడిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గజ్వేల్‌లో మాత్రం లీడింగ్‌లో ఉన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, స్టేషన్‌ ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరి, జుక్కల్‌లో షిండే,శేరిలింగంపల్లిలో గాంధీ లీడింగ్‌లో ఉన్నారు. మిగతా చోట్ల మాత్రం కాంగ్రెస్ అభ్యర్థులు లీడింగ్‌లో కొనసాగుతున్నారు. సిద్దిపేటలో హరీష్ రావు ,సిరిసిల్లలో కేటీఆర్ ఆధిక్యంలో ఉన్నారు …

మునుగోడులో రెండో రౌండ్‌ ముగిసే సరికి కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి 2 వేల ఓట్ల ముందంజలో ఉన్నారు. నిర్మల్‌లో బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉండగా, కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి కూనంనేని ముందంజలో ఉన్నారు. దేవరకద్రలోనూ కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్‌రెడ్డి, బెల్లంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి వినోద్, హుస్నాబాద్‌‌లో పొన్నం ప్రభాకర్, జగిత్యాలలో జీవన్‌రెడ్డి, హుజూర్‌నగర్‌లో తొలి రౌండ్‌లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 2,380 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తుంగతుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి సామేలు ముందంజలో ఉన్నారు.

Related posts

బీఆర్ యస్ కు బై …కాంగ్రెస్ కు జైఅన్న బీఆర్ యస్ ఎమ్మెల్యే మైనంపల్లి…!

Ram Narayana

ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల తిరస్కరణ.. గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతించిన కిషన్ రెడ్డి

Ram Narayana

గ్యారంటీలకు వారంటీ లేదన్నవారికీ చెంపపెట్టుగా రెండు గ్యారంటీల అమలు …మంత్రులు , భట్టి ,తుమ్మల ,పొంగులేటి!

Ram Narayana

Leave a Comment