Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

నేను చీటర్ ను కాదు …ఫైటర్ ను …ఖమ్మం ముఖ్యకార్యకర్తల సమావేశంలో పువ్వాడ..

నేను చీటర్ ను కాదు …ఫైటర్ ను ..ఖమ్మంలో పక్కాగా గులాబీ జెండా ఎగరేస్తాం …పదవులు కాదు ప్రజా జీవితంలో ఉండటం ముఖ్యం …ఎల్లప్పుడూ ప్రజలు అందుబాటులో ఉంటా… మీకు ఏకష్టం వచ్చిన నేను ఉన్నానని మంత్రి ,బీఆర్ యస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు ..ఖమ్మం నగరం మమత లోని నివాసంలో నాయకులు, ముఖ్య కార్యకర్తలతో ఎర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు …100 రోజుల ఎన్నికల ప్రచారంలో నాతో ఉన్నవారందరూ 24 క్యారెట్ గోల్డ్ …సింహాలు అందరికి శిరసు వంచి నమస్కారాలు తెలుపుకుంటున్నానని అన్నారు …

ప్రభుత్వం పై నమ్మకంతో ఓటు వేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరును కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు…ప్రజల ఆశీర్వాదంతోని ప్రజల మనసులు గెలుచుకొని మనం మళ్లీ అధికారo లోకి రావడం జరుగుతుందన్నరు…మొదటిసారి కేసీఆర్ గారు ఎన్నికల రణంలోకి దిగినప్పుడు కేవలం 63 సీట్లతోనే ఆరోజున అధికారంలోకి రావడం జరిగిందన్నారు…
అధికారంలోకి వచ్చినా కూడా వచ్చిన తెలంగాణను కూలదోయాలని వచ్చిన ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని వచ్చిన తెలంగాణని రెచ్చగొట్టాలని ప్రయత్నం చేశారన్నారు… మొదటి టర్మ్ లోనే చాలా మంది ఇదే కాంగ్రెస్ నాయకులు వచ్చిన తెలంగాణను మళ్ళీ ఆంధ్రలో కలపుతామని కుట్రలు కూడా చేశారన్నారు…కానీ కెసిఆర్ అలాంటి కుట్రలను చేధించి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనుకున్న వాళ్లకే చెoపపెట్టులాగా ఓటుకు నోటు కేసులో దొంగల్ని పట్టించి.. ఈరాష్ట్రాన్ని సుశీలమైన పాలనను అందించి మళ్ళీ రెండవసారి ఎన్నికలకు వెళ్లారు..,రెండోసారి ఎన్నికలకు వెళ్ళినా కూడా మళ్లీ సమైక్య వాదులంతా కలిసి అదే కుట్రలను పన్ని వచ్చిన తెలంగాణను విఫల తెలంగాణగా చిత్రీకరించాలని కుట్రలు చేశారని పేర్కొన్నారు.

అన్ని పార్టీలు కలిసి వచ్చి మహాకూటమి రూపంలో కేసీఆర్ ని ఒంటరి చేసి ఓడించాలని శాయ శక్తుల ప్రయత్నం చేసినయి అన్ని పార్టీలు చేయని ప్రయత్నం లేదన్నారు…
ఆనాడు అన్ని పార్టీలు కలిసి ఆనాడు టీఆర్ఎస్ పార్టీని ఓడించాలని ఇదే మైండ్ గేమ్ ఆడారు.. ఇదే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారు…అప్పుడు కూడా.. కానీ ప్రజల ఆశీర్వాదం brs కే ఇచ్చారని గుర్తు చేశారు…కేసీఆర్ 88 సీట్లు బ్రహ్మాండంగా ఎవరూ ఊహించని విధంగా అధికారంలోకి రావటం జరిగిందన్నారు…త్రాగునీరు ఇచ్చిన తరువాతనే 2018లో ఎన్నికలకు వెళ్ళడం జరిగిందన్నారు… అలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు అని అన్నారు. తొలి సారి గెలిచిన అనంతరం శాసన సభలో 24గంటల నిరంతరం విద్యుత్ అందిస్తామని కేసీఅర్ చెప్పారు.. అప్పుడు జానారెడ్డి ఆచరణ సాధ్యం కాదని అపహస్యం చేసిన సందర్భం గుర్తు చేశారు…అలా చేస్తే గులాబీ జెండా కప్పుకుని మీకు అనుకూలంగా ప్రచారం చేస్తా అని చెప్పారు.. వాళ్ళు మయం అయ్యారు కానీ నేడు నిరంతర విద్యుత్, రైతులకు ఉచిత విద్యుత్ మాత్రం కొనసాగుతూనే ఉందన్నారు.

చిన్న రాష్ట్ర, కొత్త రాష్ట్రం లో జరుగుతునన్ని సంక్షేమ పథకాలు మరెక్కడా జరగడంలేదనే దాంట్లో అతిశయోక్తి లేదన్నారు. జిడిపి వడ్లు పండించిన ధాన్యం, ధాన్యం కొనుగోలులో గానీ, ఉచిత విద్యుత్, ఎరువలు, విత్తనాలు, పెన్షన్లు, ఇలా అనేక పథకాలు అందిస్తున్నది కేసీఅర్ గారు ఒక్కరే అన్నారు. మళ్ళీ గెలిచేది మనమే అని స్పష్టం చేశారు పువ్వాడ …

Related posts

నాగెలుపులో ప్రధానపాత్ర వహించి 50 వేల మెజార్టీ ఇచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు శాల్యూట్ ..! మంత్రి తుమ్మల

Ram Narayana

ఖమ్మం వార్తలు…….

Drukpadam

జుబ్లియంట్ మూడ్ లో భట్టి, పొంగులేటి ,తుమ్మల

Ram Narayana

Leave a Comment