Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

పొంగులేటి అభినందనలు …ప్రజాతీర్పును గౌరవిస్తున్నా…కందాల ఉపేందర్ రెడ్డి!

పాలేరు నియోజకవర్గంలో బీఆర్ యస్ అభ్యర్థిగా పోటీచేసిన నాగులుపు కోసం పనిచేసిన కార్యకర్తలకు , కుటుంబసభ్యులకు సహకరించిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు చెపుతున్నట్లు పాలేరు తాజా మాజీఎమ్మెల్యే కందాల ఉపేదర్ రెడ్డి తెలిపారు …తన ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడిన కందాల తనపై గెలుపొందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు …తనకు ఓటివేసిన ఓటర్లకు ,పాలేరు నియోజకవర్గ ప్రజలకు నమస్కారాలు అన్నారు .. ఈరోజు వచ్చిన ఎన్నికల ఫలితాలకు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ హృదయపూర్వకంగా స్వీకరిస్తున్నానని పేర్కొన్నారు .. ఎన్నికలలో గెలుపు,ఓటములు సహజం.దాన్ని స్పోర్టివ్ గా తీసుకుని ముందుకు పోతానని ఈసందర్భంగా తెలియజేస్తునన్నారు .

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రలో అత్యధిక స్థానాలను గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న దరిమిలా వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తు..మంచి పరిపాలన అందిస్తారని ఆశిస్తున్నాను.

Related posts

సత్తుపల్లిలో సండ్రకు ప్రజల బ్రహ్మరథం …రోజురోజుకు పెరుగుతున్న మద్దతు…

Ram Narayana

అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి …. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

Ram Narayana

చేతికి జైకొట్టారా …? కారుకు సై అన్నారా…? ఓటర్ దేవుళ్ళు ఎవరిని కరుణించారు ..

Ram Narayana

Leave a Comment