Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

తుమ్మ ముళ్లు బాగా గుచ్చుకున్నట్లేగా..: కేసీఆర్‌కు తుమ్మల చురక

  • ఇటీవల ప్రచారంలో ఖమ్మంలో తుమ్మలపై కేసీఆర్ సెటైర్లు
  • తుమ్మ ముళ్లు కావాలా? పువ్వాడ పువ్వులు కావాలా? అంటూ వ్యాఖ్యలు
  • ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చిన తుమ్మల  

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన తుమ్మల నాగేశ్వరరావు మరోసారి స్పందించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ… తుమ్మ ముళ్లు కావాలా? పువ్వాడ పువ్వులు కావాలా? అంటూ తుమ్మలకు చురకలు అంటించారు. 

అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పాటు తుమ్మల తానూ గెలిచారు. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘తుమ్మ ముళ్లు బాగా గుచ్చుకున్నట్లేగా మీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడికి..’ అని ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు.

Related posts

మూడు నెలలు మూసీ పక్కనే ఉంటా ..రేవంత్ సవాల్ కు సిద్ధమన్న కేటీఆర్!

Ram Narayana

గెలిచిన మంత్రులు.. ఓడిన మంత్రులు వీరే!

Ram Narayana

కేటీఆర్ తన ఫ్రెండ్‌కు టిక్కెట్ ఇచ్చారు, ఎలా గెలుస్తారో చూస్తా: రేఖానాయక్ కంటతడి

Ram Narayana

Leave a Comment