Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

ముఖ్యమంత్రి ప్రకటన రేపటికి వాయిదా… డీకే శివకుమార్‌కి ఢిల్లీకి పిలుపు

  • డీకే శివకుమార్ సహా నలుగురు పరిశీలకులను ఢిల్లీకి పిలిచిన కాంగ్రెస్ పెద్దలు
  • సాయంత్రం ఢిల్లీకి బయలుదేరిన శివకుమార్
  • ఖర్గేతో సీఎల్పీ నేత, ఉపముఖ్యమంత్రి పదవులపై చర్చలు

తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటన వాయిదాపడింది! ఈరోజు మధ్యాహ్నం… కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తుందని భావించారు. వివిధ అంశాల కారణంగా ప్రకటన జరగలేదు. అయితే సీఎం అభ్యర్థి ప్రకటన, ఎన్నికల ఫలితాలను సమీక్షించేందుకు కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సహా నలుగురు పరిశీలకులను ఆ పార్టీ అధిష్ఠానం ఢిల్లీకి పిలిపించుకుంది. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ నేడు సాయంత్రం ఢిల్లీకి బయలుదేరారు. రేపు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో చర్చలు జరిపి సీఎల్పీ నేతను ఎంపిక చేయనున్నారు. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి, ఏ నేతకు ఏ పోర్ట్‌పోలియో ఇవ్వాలో కూడా చర్చించనున్నారు.

Related posts

80 వేల పుస్తకాలు చదివి ఇంజినీర్‌గా మారి కేసీఆర్ ‘కాళేశ్వరం’ నిర్మించారు.. కిషన్ రెడ్డి ఎద్దేవా

Ram Narayana

తెలంగాణాలో కారుదే జోరు 12 ఎంపీ సీట్లు గెలవడం ఖాయం …ఎంపీ వద్దిరాజు

Ram Narayana

మాకు గతంలో వలె 88 సీట్లు రాకపోవచ్చు, ఈటల రాజేందర్ 50 చోట్ల పోటీ చేసినా పర్లేదు: కేటీఆర్

Ram Narayana

Leave a Comment