Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

తుపాను తీరం దాటినప్పటికీ రేపు కూడా వర్షాలు: ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ

  • బాపట్ల వద్ద తీరం దాటిన మిగ్జామ్ తుపాను
  • తుపాను క్రమంగా బలహీనపడుతుందన్న ఏపీఎస్ డీఎంఏ
  • పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడి 

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్జామ్ తుపాను ఈ మధ్యాహ్నం తీరం దాటిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్ డీఎంఏ) పత్రికా ప్రకటన విడుదల చేసింది. మిగ్జామ్ తుపాను క్రమంగా బలహీనపడుతుందని, అయితే తుపాను తీరం దాటినప్పటికీ రేపు (డిసెంబరు 6) కూడా వర్షాలు పడతాయని ఏపీఎస్ డీఎంఏ వెల్లడించింది. 

బుధవారం నాడు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, బాపట్ల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 

తీరం దాటినప్పటికీ ప్రతికూల వాతావరణం కారణంగా మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని ఏపీఎస్ డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ అంబేద్కర్ వెల్లడించారు. 

Related posts

ప్రజాభవన్ లో చంద్రబాబు ,రేవంత్ రెడ్డిల భేటీ ..!

Ram Narayana

నిప్పుల కుంపటిలా తెలుగురాష్ట్రాలు …

Ram Narayana

చంద్రబాబుకు మంద కృష్ణ మాదిగ ప్రశంసలు… రేవంత్ రెడ్డిపై విమర్శలు

Ram Narayana

Leave a Comment