Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

తెలంగాణలో త్వరలో బీజేపీ ప్రభుత్వం: రాజాసింగ్

  • కాంగ్రెస్ ప్రభుత్వం కొద్ది రోజులే పాలిస్తుందన్న బీజేపీ నేత
  • కేసీఆర్ చేసిన అప్పులు తీర్చలేక కాంగ్రెస్ చేతులెత్తేస్తుందని వ్యాఖ్య
  • దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ కేసీఆర్ పై ఫైర్

తెలంగాణను అభివృద్ధి చేయడం కేవలం బీజేపీకి మాత్రమే సాధ్యమని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాలను బీజేపీ గెల్చుకుందని చెప్పారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని, కేసీఆర్ చేసి వెళ్లిన అప్పులు తీర్చే క్రమంలో చతికిలపడుతుందని ఆయన జోస్యం చెప్పారు. ఏడాది లోపే ఆ పార్టీ కూడా చేతులెత్తేస్తుందని అన్నారు. ఆపై తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వమే వస్తుందని రాజా సింగ్ ధీమా వ్యక్తం చేశారు.

ఈమేరకు బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన బీఆర్ అంబేద్కర్ వర్దంతి కార్యక్రమంలో రాజాసింగ్ పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని దళితులకు ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని మార్చేస్తానంటూ కేసీఆర్ వ్యాఖ్యానించడంతో ప్రజలు సీఎంనే మార్చేశారని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీకి 8 ఎమ్మెల్యే సీట్లను ఇచ్చినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

Related posts

గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై తమిళిసై కీలక నిర్ణయం

Ram Narayana

ఆ రెండు పార్టీలు తోడు దొంగలు: బీఆర్ఎస్, బీజేపీలపై విజయశాంతి విమర్శలు

Ram Narayana

ఏపీలో వైసీపీకి షాకుల మీద షాకులు …పార్టీకి గుడ్ బై చెపుతున్న ఎమ్మెల్సీలు ,ఎమ్మెల్యేలు

Ram Narayana

Leave a Comment