Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

అజారుద్దీన్‌కు మంత్రి పదవి… ఎల్లుండి ప్రమాణ స్వీకారం?

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్‌కు మంత్రి పదవి లభించినట్టు తెలుస్తోంది. ఎల్లుండి తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగనుందని, ఆయన మంత్రిగా ప్రమాణం చేస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణకు పార్టీ అధిష్ఠానం నుంచి అనుమతి లభించినట్లు సమాచారం.

తెలంగాణ మంత్రివర్గంలో 18 మందికి అవకాశం ఉండగా, ప్రస్తుతం 15 మంది మంత్రులు ఉన్నారు. మరో ముగ్గురికి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మైనార్టీ వర్గానికి చెందిన అజారుద్దీన్‌కు మంత్రిగా అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో ముస్లిం మైనార్టీలకు ప్రాధాన్యం కల్పించాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది.

అజారుద్దీన్ గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుత ఉప ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు ఆసక్తి చూపినప్పటికీ, ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాంల పేర్లను ఎంపిక చేసి, గవర్నర్ ఆమోదం కోసం పంపింది. గవర్నర్ ఇంకా ఆమోదం తెలపాల్సి ఉంది. అయినప్పటికీ అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఏఐసీసీ ఆమోదం తెలిపినట్లు సమాచారం.

రాజగోపాల్ రెడ్డికి కూడా అంటూ మరో ప్రచారం జరుగుతుంది ..ఇప్పటివరకు కాంగ్రెస్ వర్గాలు దీన్ని ధ్రువీకరించలేదు…ఇప్పటికే తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి పైన కారాలు మిరియాలు నూరుతున్న రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం మంత్రి పదవి ఇస్తుందా..అనేది అనుమమే…

Related posts

విద్యుత్ ను వ్యాపార వస్తువుగా చూడటం రాష్ట్ర ప్రగతికి గొడ్డలి పెట్టు …కేటీఆర్

Ram Narayana

తెలంగాణాలో పోటీచేసే బీజేపీ లోకసభ అభ్యర్థులు ….

Ram Narayana

ఇక్కడ రింగ్ రోడ్డు కోసం ల్యాండ్ పూలింగ్ చేయం: వర్ధన్నపేటలో కేసీఆర్ హామీ

Ram Narayana

Leave a Comment