Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

క్యాబినెట్ సమావేశంలో విద్యుత్ అంశంపై చర్చ …సీఎం సీరియస్

గురువారం జరిగిన తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో విద్యుత్ అంశంపై సుదీర్ఘ చర్చజరినట్లు సమాచారం …దీనిపై ఆశాఖ ఉన్నతాధికారులు చెప్పే విషయాలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్లు తెలుస్తుంది…మొత్తమీద అనేక విషయాలతోపాటు విద్యుత్ అంశం ప్రధానంగా చర్చకు వచ్చిందని అంటున్నారు ..విద్యుత్ శాఖ ప్రిన్సిపుల్ సెక్రటరీ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం ..విద్యుత్ శాఖలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దాచిపెట్టడంపై సీఎం సీరియస్ అయ్యారని విశ్వసనీయ సమాచారం …విద్యుత్ సంక్షోభం తెచ్చేలా కుట్ర జరిగిందని సీఎం సమావేశంలో అభిప్రాయపడ్డారు ….రేపటిలోగా పూర్తి వివరాలతో రావాలని ఆదేశం…రేపు ఉదయం విద్యుత్ పై సీఎం ప్రత్యేక సమీక్షఉంటుందని సీఎం చెప్పారు …విద్యుత్ శాఖలో ఇప్పటివరకు 85 వేల కోట్ల అప్పులు ఉన్నట్లు అధికారులు సీఎంకు చెప్పారు …దీనిపై ఇటీవల రాజీనామా చేసిన సిఎండి ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదించొద్దని ఆదేశించారు …రేపటి రివ్యూకు ప్రభాకర్ రావు ను రప్పించాలని అధికారులకు ఆదేశించారు సీఎం …రేపటి విద్యుత్ సమస్యపై జరిగే సమీక్షా సమావేశం మరింత హాట్ హాట్ గా ఉండే అవకాశం ఉంది ..

రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ… ఆరు గ్యారెంటీలపై చర్చ

  • సచివాలయంలో కేబినెట్ భేటీ
  • పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు
  • పాల్గొన్న సీఎస్ శాంతికుమారి, వివిధ శాఖల కార్యదర్శులు
Telangana Cabinet talks about six guarentess

కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆరు గ్యారంటీల అమలు, ప్రజా సమస్యలపై చర్చించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, సీఎస్ శాంతికుమారి, వివిధ శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు. 

కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి సీఎస్ లేఖ

నాగార్జున సాగర్ అంశంపై రేపటి సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ సీఎస్ శాంతికుమారి కోరారు. ఈ మేరకు కేంద్ర జల శక్తి కార్యదర్శికి లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైన తరుణంలో వాయిదా వేయాలని కోరారు. జనవరి నెలలో సమావేశం నిర్వహించాలని కోరారు.

Related posts

టీఎస్‌పీఎస్సీ సభ్యుల నియామకాన్ని పునఃపరిశీలించాలి: హైకోర్టు కీలక ఆదేశాలు…

Drukpadam

తెలంగాణ పదో తరగతి ప్రశ్నపత్రంలో తప్పులు.. విద్యార్థుల్లో ఆందోళన

Ram Narayana

 ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల రాయితీ గడువును పొడిగించిన తెలంగాణ

Ram Narayana

Leave a Comment