తెలంగాణ ప్రగతిభవన్ ఇకనుంచి జ్యోతిరావు పూలె ప్రజాభవన్…
రాష్ట్రంలోని ప్రతివ్యక్తికి ప్రవేశం ..తమ భాదలు చెప్పుకునే అవకాశం ఉంటుందన్న సీఎం
రేపటి నుంచే ప్రజాదర్బార్ …ఎవరైనా తమ సమస్యలు చెప్పుకోవచ్చు
ప్రగతి భవన్ కు కేసీఆర్ వేసిన కంచె తొలగింపు …
నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం …

రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది…తెలంగాణ ప్రగతిభవన్ ఇకనుంచి జ్యోతిరావు పూలె ప్రజాభవన్ మార్చారు నూతన సీఎం రేవంత్ రెడ్డి …ఆభవనం ముందు కేసీఆర్ వేసిన కంచెను హుటాహుటిన తొలగింప జేశారు …అందులోకి ప్రతి వ్యక్తికీ ప్రవేశం వారి భాదలు చెప్పుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రమాణ స్వీకారం అనంతరం జరిగిన కృతజ్ఞత సభలో మాట్లాడుతూ ప్రగతి భవన్ కంచె బద్దలు కొట్టామని ఇక నుంచి అది జ్యోతిరావు పూలె భవన్ గా పేరు మార్చుతున్నట్లు ప్రకటించారు ..రేపటి నుంచే ప్రజాదర్బార్ నిర్వహిస్తామని అన్నారు …ఎవరైనా వచ్చి తమ సమస్యలు చెప్పుకోవచ్చుఅన్నారు… ప్రగతి భవన్ లోకి ఎవరని రానివ్వలేదని ,చివరికి మంత్రులకు సైతం అనుమని లేదని ఈటెల రాజేందర్ మొత్తుకున్నారు …కొంతమందికే ప్రవేశం ఉందనే అభియోగాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది …

గత 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని అప్రతిహతంగా పాలించిన బీఆర్ యస్ ఓడిపోయింది….కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు …దీంతో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరింది …ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సీఎం నివాసం స్థలంలోనే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం అన్ని హంగులతో పెద్ద భవనాన్ని నిర్మించి దానికి ప్రగతి భవన్ అని పేరు పెట్టింది …నాటినుంచి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ దిగిపోయేంతవరకు అక్కడే కార్యకలాపాలు నిర్వహించారు …ఒక సందర్భంలో పాత సెక్రటేరియట్ కు వెళ్లడం కూడా మానేశారు …దీనిపై విమర్శలు వచ్చాయి అయిన వాటిని ఆయన లెక్క చేయలేదు….వందల కోట్లతో కొత్త సచివాలయం నిర్మించారు ..దానికి కేసీఆర్ వెళుతున్నది అంతంత మాత్రమే అనే అభిప్రాయాలూ ఉన్నాయి…