Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ప్రమాదాలు ...

రోడ్డు ప్రమాదంలో ఏపీ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం

  • ఉండి మండలం చెరుకువాడ సమీపంలో రోడ్డు ప్రమాదం
  • ఏలూరు నుంచి భీమవరం వెళ్తుండగా యాక్సిడెంట్
  • దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్న నేతలు

ఏపీలో ఈరోజు అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం పాలయ్యారు. ఏలూరు నుంచి భీమవరం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఉండి మండలం చెరుకువాడ సమీపంలో రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఆయన మృతి చెందారు. అంగన్ వాడీ వర్కర్ల సమ్మెలో పాల్గొని వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ సంభవించింది. షేక్ సాబ్జీ మృతి పట్ల పార్టీలకు అతీతంగా నేతలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతికి సంతాపం తెలిపిన జగన్, చంద్రబాబు, లోకేశ్

ఏపీ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో దుర్మరణంపాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేశ్ సంతాపం వ్యక్తం చేశారు. కేబినెట్ మీటింగ్ జరుగుతున్న సమయంలో సాబ్జీ మరణ వార్తను తెలుసుకున్న జగన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల సంతాపాన్ని ప్రకటిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

సాబ్జీ కుటుంబసభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. చివరి ఘడియల్లో కూడా సాబ్జీ ప్రజాసేవలోనే కొనియాడారని చెప్పారు. షేక్ సాబ్జీ మృతి చెందారని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని లోకేశ్ తెలిపారు. శాసనమండలిలో వినిపించే ప్రజల గొతు మూగబోయిందని చెప్పారు. ఉపాధ్యాయుల హక్కుల పోరాటయోధుడు సాబ్జీకి నివాళులు అర్పిస్తున్నానని తెలిపారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని ఎక్స్ వేదికగా స్పందించారు.

Related posts

రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఐటీ సోదాలు.. రూ. 800 కోట్ల నల్లధనం లావాదేవీల గుర్తింపు!

Drukpadam

రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేవరకూ అరువు అడగొద్దంటూ పోస్టర్!

Drukpadam

రాష్ట్రపతి పర్యటన  ట్రాఫిక్ నిలిపివేత.. మహిళా పారిశ్రామికవేత్త మృతి

Drukpadam

Leave a Comment