Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

యశోదా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మాజీ సీఎం కేసీఆర్

  • ఈ నెల 8న కేసీఆర్ కు తుంటి ఎముక మార్పిడి చికిత్స
  • నందినగర్ లోని నివాసానికి బయల్దేరిన మాజీ సీఎం
  • ఇంట్లో విశ్రాంతి తీసుకోనున్న కేసీఆర్

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యశోదా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు సాయంత్రం ప్రగతి భవన్ నుంచి నేరుగా ఆయన ఫామ్ హౌస్ కు వెళ్లారు. ఆ తర్వాత ఫామ్ హౌస్ లోని బాత్రూమ్ లో ఆయన ప్రమాదవశాత్తు కాలు జారి పడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన కాలి తుంటి ఎముక విరిగింది. దీంతో, ఆయనను ఫామ్ హౌస్ నుంచి హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. 

ఈ నెల 8న కేసీఆర్ కు తుంటి మార్పిడి ఆపరేషన్ ను వైద్యులు నిర్వహించారు. ఆసుపత్రిలో ఉన్న కేసీఆర్ ను రేవంత్ రెడ్డి, చంద్రబాబు, చిరంజీవి, నాగార్జున తదితరులు పరామర్శించారు. కాసేపటి క్రితం ఆయన యశోదా ఆసుపత్రి నుంచి బంజారాహిల్స్ నందినగర్ లో ఉన్న తన నివాసానికి బయల్దేరారు. పూర్తిగా కుదుట పడేంత వరకు ఆయన తన ఇంట్లో విశ్రాంతి తీసుకోనున్నారు. కేసీఆర్ కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని డాక్టర్లు తెలిపారు.

ఆసుపత్రి నుంచి నందినగర్ లోని తన నివాసానికి చేరుకున్న కేసీఆర్

KCR arrives his residence in Nandi Nagar

శస్త్రచికిత్స నుంచి కోలుకున్న మాజీ సీఎం కేసీఆర్ యశోదా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కొద్దిసేపటి కిందట నంది నగర్ లోని తన నివాసానికి చేరుకున్నారు. ఆయనకు సంప్రదాయ పద్ధతిలో గుమ్మడి కాయతో దిష్టి తీసి హారతి పట్టి ఇంట్లోకి స్వాగతించారు. 

కేసీఆర్ రాక నేపథ్యంలో, నంది నగర్ నివాసం వద్ద భారీ కోలాహలం నెలకొంది. కేసీఆర్ ఇంట్లోకి ప్రవేశించగానే, వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు. ఆయనకు పట్టుబట్టలు బహూకరించారు. డిసెంబరు 7న కేసీఆర్ యర్రవల్లిలోలని తన ఫాంహౌస్ లో కాలు జారి పడిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులు హైదరాబాదు యశోదా ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆయన ఎడమకాలి తుంటి ఎముకకు శస్త్రచికిత్స నిర్వహించారు.

Related posts

ఉచిత విద్యుత్ పై బీఆర్ యస్ ది గోబెల్స్ ప్రచారం …సీఎల్పీ నేత భట్టి

Drukpadam

హన్మకొండలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకోసం బీజేపీ పోరాటం రక్తసిక్తం …

Ram Narayana

భవిష్యత్తు పోరాటాల ను నిర్దేశించనున్న టీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభలు..

Ram Narayana

Leave a Comment