Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

 ఉమ్మడి పాలనలో అన్యాయం జరుగుతోందనే తెలంగాణ తెచ్చుకున్నాం: పొన్నం ప్రభాకర్

  • గత యాభై ఏళ్ల చరిత్ర గురించి ఇప్పుడు అవసరంలేదన్న మంత్రి
  • తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో మాట్లాడుకుందామని హితవు
  • కేటీఆర్ విమర్శలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్
Minister Ponnam Prabhakar Counter Attack On KTR

ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందనే పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో గుర్తుచేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ వచ్చాక పదేళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనుల గురించి మాట్లాడాలని కేటీఆర్ కు హితవు పలికారు. 

తెలంగాణలో గత ప్రభుత్వ కార్యకలాపాలపై మాట్లాడేందుకు ఏమీ కనిపించడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. పైన పటారం లోన లొటారం తరహాలో గత ప్రభుత్వం పాలించిందని, ఊపర్ షేర్వాణీ అందర్ పరేషానీ తీరులో పాలన జరిపిందని విమర్శించారు. ప్రతిపక్ష నేతగా వాస్తవాలను మాట్లాడాలని అంతేకానీ మా తాతలు మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టారని చెబితే కుదరంటూ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.

Related posts

బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అప్పులకుప్పగా మారింది: బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

Ram Narayana

ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో… చూస్తా అనడం సరికాదు: కూనంనేని

Ram Narayana

లోక్ సభ ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉంటుంది: కేటీఆర్

Ram Narayana

Leave a Comment