Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రఘురామ రాజకీయం ……

రఘురామ రాజకీయం ……
జగన్ సీబీఐ కోర్టులో వేసిన కౌంటర్ పై స్పందన
జగన్ పై వేసిన పిటిషన్ లో నా స్వార్థం లేదు
జగన్ తరపు న్యాయవాది చేసిన ఆరోపణల్లో నిజం లేదు
వేంకటేశ్వరస్వామి అన్నీ చూసుకుంటారు
రఘురామ ,ఏపీ ప్రభుత్వం మధ్య కొనసాగుతున్న వార్ ఇప్పటిలో ఆగేలా లేదు … ఎత్తులు పై ఎత్తులతో ఏపీ రాజకీయాలలో ఏమిజరుగబోతుందో అనే ఉత్కంఠ కొనసాగుతుంది.
అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ సీబీఐ కేసులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన బెయిల్ పై బయట ఉన్నారు. ఈ నేపథ్యంలో, సీఎం హోదాలో ఉన్న జగన్ బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని… వెంటనే ఆయన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ కు సంబంధించిన విచారణ ప్రస్తుతం కోర్టులో కొనసాగుతోంది. ఈరోజే జగన్ తరపు న్యాయవాదులతో పాటు, సీబీఐ కూడా కోర్టులో కౌంటర్లు దాఖలు చేసింది.

ఈ సందర్భంగా రఘురాజు స్పందిస్తూ… జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ తాను వేసిన పిటిషన్ వెనుక ఎలాంటి వ్యక్తిగత స్వార్థం లేదని చెప్పారు. కోర్టులో జగన్ తరపు న్యాయవాది చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవని అన్నారు. పైనున్న వేంకటేశ్వరస్వామి అన్నీ చూసుకుంటారని వ్యాఖ్యానించారు. ఈ కేసులో కచ్చితంగా న్యాయం జరుగుతుందనే ఆశాభావం తనకు ఉందని చెప్పారు. జగన్ వేసిన కౌంటర్ లో ఎలాంటి విషయం లేదని తెలిపారు. తన ఆరోగ్యం కోసం, తన బెయిల్ కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ పాదాభివందనాలు చేస్తున్నానని అన్నారు.

Related posts

మోదీ, అమిత్ షా, యోగిలపై విరుచుకుపడిన ‘సామ్నా’

Drukpadam

కమ్యూనిస్టుల త్యాగాలవల్లనే తెలంగాణ విలీనం జరిగింది.:సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని

Drukpadam

బీఆర్ యస్ ,కమ్యూనిస్టుల మధ్య పొత్తు పై ముందుకు పడని అడుగులు …!

Ram Narayana

Leave a Comment