Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఖమ్మం జిల్లా మంత్రులకు పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జిల భాద్యతలు

ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులకు రానున్న లోకసభ ఎన్నికలు పరీక్షా సమయంగా మారనున్నాయి… జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులకు ఐదు లోకసభ స్థానాల భాద్యత అప్పగించారు .. ప్రధానంగా ఖమ్మం మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం మంత్రి శ్రీనివాస్ రెడ్డికి, అదేవిధంగా హైదరాబాద్, సికింద్రాబాద్ బాధ్యతలను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మల్కాజిగిరి లోకసభ నియోజకవర్గ బాధ్యతలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అప్పగించారు. వారు ఈ నియోజకవర్గాల బాధ్యతలను చేపట్టి అక్కడ పార్టీ విజయానికి కావాల్సిన చర్యలు చేపడతారు … అందు కోసం ఇప్పటినుండి కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక బద్దంగా చర్యలు చేపట్టింది. ఆయా నియోజకవర్గాల్లోని కార్యకర్తలు నాయకులు మధ్య సమన్వయం లాంటి సమస్యలు, అభ్యర్థుల ఎంపిక తదితర విషయాలను ఇన్చార్జీలు సమీక్ష చేస్తారు. అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతను పూర్తిగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ తీసుకుంటుంది. అందుకోసం ఆ నియోజకవర్గాలకు ఎఐసిసి ప్రతినిధులు వచ్చి పోటీకి ఆశక్తి ఉన్నవారి పట్ల ప్రజలలో ఎలాంటి అభిప్రాయాలూ ఉన్నాయనే విశాలాయాలను సమీక్ష చేస్తారు. అనంతరం పోటీ చేసే వారి పేర్లను తీసుకొని అధిష్టానానికి సమర్పించి సెంట్రల్ ఎలక్షన్ కమిటీలు చర్చించి అభ్యర్థులు ఫైనల్ చేస్తాయి… ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటినుంచే లోకసభ అభ్యర్థులపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు నియోజకవర్గా లకు ఇన్చార్జీలు నియమించి పని ప్రారంభించింది. దేశంలో నెలకొన్న అశాంతి అసమానతలు తదితర విభజించబడుతున్న ప్రజలను ఐక్యం చేసి భారతదేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించాలని ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది . అందులో భాగంగానే ఇప్పటికీ ఇండియా కూటమి పేరిట ఒక ఫ్రంట్ ఏర్పాటు చేశారు. అందులో వివిధ పార్టీలు ఉన్నాయి ప్రధానంగా ప్రాంతీయ పార్టీలు కూడా ఈ కూటమిలో ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. రానున్న పార్లమెంటు ఎన్నికల కోసం ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో కింది నుంచి చర్యలు చేపట్టారు. తెలంగాణలో పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ అధికారంలో రావటంతో కాంగ్రెస్ కార్యకర్తలు మంచి జోష్ నింపింది. అది లోకసభ ఎన్నికలకు ఉపయోగపడుతుందని పార్టీ భావిస్తుంది… దీంతో ఇక్కడ 17 సీట్లులో ఎక్కువ సీట్లు గెలు పొందడం ద్వారా తెలంగాణ సత్తా చాటాలని పార్టీ భావిస్తుంది. అందుకోసం రాజకీయనిర్ణాయక కమిటీ సమావేశం సోమవారం హైదరాబాదులో జరిగింది … దీనిలో భాగంగానే ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసిన విధంగా ఆరు గ్యారెంటీలను ప్రజల్లో ముమ్మరంగా తీసుకుపోవడం ద్వారా కనీసం 12 నుండి 15 సీట్లు పొందాలని ఉద్దేశంతో కార్యాచరణ రూపొందిస్తున్నది …

Related posts

డీకే అరుణ అరెస్ట్ పై తీవ్రంగా స్పందించిన బండి సంజయ్

Ram Narayana

మీతో నాకున్నది కుటుంబ అనుబంధం: రాహుల్ గాంధీ!

Ram Narayana

బీజేపీ ,బీఆర్ యస్ కుమ్మక్కు రాజకీయాలు…నాపై ఐటీ దాడులుజరిపే అవకాశం ….

Ram Narayana

Leave a Comment