Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

అధైర్య పడవద్దకు …కార్యకర్తలకు నాయకులకు కేటీఆర్ ఉద్బోధ

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో నిరాశ పడవద్దు .. కేటీఆర్

  • లోక్ సభ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపు
  • హైదరాబాద్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి కృషి చేసిన వారికి ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్
  • హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ చాలా పటిష్ఠంగా ఉందని వ్యాఖ్య

రానున్న లోక్ సభ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అందరం కలిసికట్టుగా పని చేసి తెలంగాణలో అత్యధిక లోక్ సభ స్థానాలు గెలిచే విధంగా ముందుకు సాగుదామన్నారు. జీహెచ్ఎంసీ బీఆర్ఎస్‌ కార్పొరేటర్లతో తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో బీఆర్ఎస్ విజయానికి కృషి చేసిన పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ… హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ చాలా పటిష్ఠంగా ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఏమాత్రం నిరాశపడవద్దని సూచించారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ధైర్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇష్టారీతిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. ఆ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువద్దామని పిలుపునిచ్చారు.

Related posts

ఇకనుంచి ప్రజలు తప్పు చేశారని అనవద్దు …కేటీఆర్

Ram Narayana

తెలంగాణ ఎన్నికలు.. కేసీ వేణుగోపాల్ తో సీపీఐ నారాయణ భేటీ

Ram Narayana

బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. మరో ఎమ్మెల్యే గుడ్ బై?

Ram Narayana

Leave a Comment