Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

ట్రాఫిక్‌ చలానాలపై మరోసారి భారీ రాయితీ.. సన్నద్ధమవుతున్న తెలంగాణ పోలీసు శాఖ

  • పెండింగ్ చలానాలను తగ్గించుకునే దిశగా అడుగులు వేస్తున్న పోలీసు శాఖ
  • గతేడాది మాదిరిగానే భారీగా రాయితీలు ఇవ్వాలని నిర్ణయం
  • త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం
Telangana police department is preparing for another huge discount on traffic challans

గతేడాది మాదిరిగానే పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలానాలపై రాయితీలు ప్రకటించాలని తెలంగాణ పోలీసు శాఖ యోచిస్తోంది. భారీగా రాయితీలు ప్రకటించి రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న చలానాల సంఖ్యను తగ్గించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు పోలీసు శాఖ సన్నద్ధమవుతోంది. త్వరలోనే సంబంధిత ప్రకటన విడుదల కానుందని సమాచారం. కాగా గతేడాది ట్రాఫిక్ చలానాలపై రాయితీ ప్రకటించడం మంచి ఫలితాలను అందించింది. పెండింగ్ చలానాల రూపంలో ఏకంగా రూ.300 కోట్ల వరకు జరిమానాలు వసూలయ్యాయి. 

నవంబర్ 2023 చివరి నాటికి రాష్ట్రంలో పెండింగ్ చలానాల సంఖ్య రెండు కోట్లకు చేరుకుందని అంచనాగా ఉంది. ఈ సంఖ్యను వీలైనంతగా తగ్గించడమే లక్ష్యంగా రాష్ట్ర పోలీసు శాఖ అడుగులు వేస్తోంది. నిర్ణీత వ్యవధిలో చలానాలు చెల్లించేవారికి మరోమారు రాయితీ కల్పించాలని నిర్ణయించింది. కాగా 2022 మార్చి 31 నాటికి రాష్ట్రంలో 2.4 కోట్ల చలానాలు పెండింగ్‌లో ఉండగా ప్రత్యేక రాయితీ ప్రకటించడంతో చాలామంది వాహనదారులు ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్న విషయం తెలిసిందే.

Related posts

ఏదో అద్భుతం జరుగుతున్నట్టు కేసీఆర్ భ్రమలు కల్పిస్తున్నారు: భట్టి

Drukpadam

సీఎం మార్పును కొట్టి పారేసిన రెవెన్యూ మంత్రి పొంగులేటి…

Ram Narayana

అప్పుల రాష్ట్రాన్ని గట్టేక్కిస్తా…బోనకల్ పౌరసన్మాన సభలో డిప్యూటీ సీఎం భట్టి ..

Ram Narayana

Leave a Comment