తెలంగాణ వార్తలు

కాళేశ్వరం వల్లే వరిసాగు పెరిగిందన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైంది: రేవంత్ రెడ్డి

  • వరి ఉత్పత్తిలో చరిత్ర సృష్టించిన తెలంగాణ
  • కాళేశ్వరంతో సంబంధం లేకుండా రికార్డు స్థాయిలో వరిధాన్యం పండిందన్న రేవంత్
  • ఇది తెలంగాణ రైతుల ఘనత అని కితాబు

దేశంలోనే వరి సాగు, ధాన్యం ఉత్పత్తితో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. పంజాబ్ ను అధిగమించి చరిత్ర సృష్టించింది. వానాకాలం సీజన్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా 66.77 లక్షల విస్తీర్ణంలో వరిసాగు జరిగింది. ఏకంగా 153 లక్షల టన్నుల వరి ఉత్పత్తి జరిగింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

“కాళేశ్వరం వల్లే తెలంగాణలో వరిసాగు పెరిగిందన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైంది. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ కుంగి, నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోయినా… ఎన్డీఎస్ఏ సూచన మేరకు అన్నారం, సుందిళ్లలో నీటిని నిల్వ చేయకపోయినా… కాళేశ్వరంతో సంబంధం లేకుండా తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రికార్డు స్థాయిలో వరిధాన్యం పండింది. ఇది తెలంగాణ రైతుల ఘనత. వారి శ్రమ, చెమట, కష్టం ఫలితం. తెలంగాణ రైతు దేశానికే గర్వకారణం. ఈ ఘనత సాధించిన ప్రతి రైతు సోదరుడికి హృదయపూర్వక అభినందనలు” అని రేవంత్ ట్వీట్ చేశారు. 

Related posts

రేవంత్ రెడ్డి హార్వర్డ్ కోర్సు పూర్తి.. తొలి సీఎంగా చరిత్ర…

Ram Narayana

హైదరాబాద్ పోలీసులపై మండిపడ్డ డీకే అరుణ

Ram Narayana

ఢిల్లీలో రేవంత్‌రెడ్డి కోసం అధికారిక నివాసం రెడీ.. కేసీఆర్ నేమ్‌ప్లేట్ తొలగింపు

Ram Narayana