- ఈ నెల 27న సింగరేణి ఎన్నికలు
- ఎన్నికల్లో పోటీ చేయొద్దని తమ అనుబంధ సంఘానికి చెప్పిన కేసీఆర్
- నిరాశతో రాజీనామా చేసిన ముగ్గురు టాప్ లీడర్లు
సింగరేణి ఎన్నికలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పోటీ చేయవద్దని ఆయన ఆదేశించారు.
సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు కోసం జరుగుతున్నఎన్నికలకు దూరంగా ఉండాలని కేసీఆర్ నిర్ణయంపై బీఆర్ యస్ అనుబంధ కార్మిక సంఘమైన బొగ్గుగని కార్మికసంఘాన్ని దూరంగా ఉండాలని కేసీఆర్ ఆదేశించడం బూమరాంగ్ అయింది …ఎన్నికల్లో పాల్గొనకూడదన్న కేసీఆర్ నిర్ణయాన్ని కార్మికసంఘనేతలు తప్పు పడుతున్నారు …కేసీఆర్ నిర్ణయం తప్పుడు నిర్ణయమని యూనియన్ ముఖ్యనేతలు బాహాటంగానే ప్రకటించారు …అంతే కాకుండా అధికార ఐఎన్టీయూసీ యూనియన్ లో చేరాలని నిర్ణయించుకున్నారు …ఇప్పటికే వారి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో చర్చలు జరిపారు …దీంతో బీఆర్ యస్ కార్మికసంఘం పరేషాన్ అయింది …
దీంతో సదరు కార్మిక సంఘం నేతలు షాక్ కు గురయ్యారు. యూనియన్ కు చెందిన ముగ్గురు టాప్ లీడర్లు రాజీనామా చేశారు. వీరిలో యూనియన్ ప్రెసిడెంట్ వెంకట్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేంగెర్ల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేయనప్పుడు యూనియన్లో ఎందుకుండాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు వీరు మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.
మరోవైపు మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ… ఉద్యమం నుంచి పుట్టిన యూనియన్ ను ఎన్నికల్లో పోటీ చేయొద్దని చెప్పడం ఆత్మహత్యాసదృశమేనని అన్నారు. పోటీ చేయొద్దని చెప్పడం బాధాకరమని చెప్పారు. కాగా, అసంతృప్త నేతలు కాంగ్రెస్ లో చేరనున్నట్టు తెలుస్తోంది.