Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు చేసిన కేంద్రం…

  • దేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
  • ప్రధాని మోదీ అధ్యక్షతన సమీక్ష సమావేశం
  • కీలక నిర్ణయం తీసుకున్న ప్రధాని
  • విద్యార్థుల ఆరోగ్యమే ముఖ్యమని స్పష్టీకరణ

దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ సాయంత్రం జరిగిన సమీక్ష సమావేశంలో సీబీఎస్ఈ పరీక్షలపై చర్చించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు జరపకపోవడమే మేలని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతే ముఖ్యమని స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా పరీక్షలు రాయాలనుకుంటే, వారికి కరోనా తీవ్రత తగ్గాక పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. పరీక్షలకు హాజరు కావాలని విద్యార్థులను బలవంతపెట్టొద్దని పేర్కొన్నారు.

Related posts

సొంత ఊరికి మంచి చేయాలని భావించి… తిరిగిరాని లోకాలకు వెళ్లిన బిపిన్ రావత్!

Drukpadam

 సీఎం జగన్‌తో అవినాశ్‌ రెడ్డి భేటీ

Ram Narayana

జ్యోతుల నెహ్రు కు గుండెపోటు …చంద్రబాబు పరామర్శ!

Drukpadam

Leave a Comment