Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

ప్రజాపంథా పార్టీ కార్యాలయానికి మంత్రి తుమ్మల …

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం సిపిఐ (ఎం ఎల్ ) ప్రజాపంథా కార్యాలయానికి వెళ్లారు ….ఎన్నికల్లో ప్రజాపంథా పార్టీ దాని అనుబంధ సంఘాలు తుమ్మలకు మద్దతుగా నిలిచాయి…కీలకమైన ఎన్నికల్లో ప్రజాపంథా ఇచ్చిన తోడ్పాటు గుర్తు పెట్టుకున్న తుమ్మల ఎన్నికల ముందు వారి కార్యాలయానికి వెళ్లిన విధంగానే గెలిచి మంత్రి అయిన తర్వాత వెళ్లారు …పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు , మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య , పార్టీ జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వర్లు , రాయల చంద్రశేఖర్ లను మంత్రి కలుసుకొని కృతఙ్ఞతలు తెలిపారు …ఈసందర్భంగా పోటు రంగారావు ప్రజాసమస్యల పరిష్కరానికి ప్రధానంగా గిరిజనుల సమస్యలు ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని మంత్రి దృష్టికి తెచ్చారు …స్పందించిన మంత్రి తప్పకుండ వాటిని అడ్రస్ చేస్తానని అన్నారు..ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకోని రావచ్చునని అన్నారు …పీడీఎస్ యూ నేతలు జిల్లాకు యూనివర్సిటీ కావాలని విజ్ఞాపన పత్రం అందజేశారు …తాను ఈవిషయం అధికారులతో మాట్లాడి యూనివర్సిటీ వచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు …

స్థానిక ఖమ్మం నగరంలోని సిపిఐ(ఎంఎల్) ప్రజాపంథా జిల్లా కార్యాలయానికి విచ్చేసిన రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర్ రావు గారికి ఖమ్మం కేంద్రంగా జనరల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరుతూ ఈరోజు పి. డి. ఎస్. యూ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది..

ఈ కార్యక్రమంలో పి. డి. ఎస్. యూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాల ఆజాద్, ఖమ్మం జిల్లా కార్యదర్శి వెంకటేష్, పి. డి. ఎస్. యూ ఖమ్మం డివిజన్ కార్యదర్శి లక్ష్మణ్, నాయకులు కరుణ్, శ్రీకాంత్, పృథ్వి, ప్రసాద్, సందీప్, శ్రీను, భరత్, విష్ణు తదితరులు పాల్గొన్నారు…

కారేపల్లి మండల పరిధిలోని పోలంపల్లి గ్రామపంచాయతీలో గల కోటిలింగాల ఆలయం వద్ద బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరావును ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య కోరారు . కారేపల్లి మండలానికి చెందిన పలువురు సిపిఐ ఎంఎల్ పార్టీ కి సంబంధించిన నాయకులతో కలిసి ఖమ్మంలో మంత్రి తుమ్మలకు ఈ రోజు వినతిపత్రం అందజేశారు . మహాశివరాత్రి సందర్భంగా కోటిలింగాల ఆలయం వద్ద జాతర జరుగుతుందని తెలిపారు .

Related posts

ప్రచారంలో దుమ్ము రేపుతున్న బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు…

Ram Narayana

కీంకర్తవ్యం … ఖమ్మం కాంగ్రెస్ నేతల సమాలోచనలు…

Ram Narayana

పోలీస్ కమిషనర్ కు మాజీ మంత్రి పువ్వాడ, వద్దిరాజు ఫిర్యాదు

Ram Narayana

Leave a Comment