జాతీయ వార్తలు

 అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి హాజరవుతున్న సోనియాగాంధీ

  • జనవరి 22న రామాలయం ప్రారంభోత్సవం
  • దాదాపు 6 వేల మందికి ఆహ్వానాలు
  • సోనియా, ఖర్గేలకు కూడా ఆహ్వానం
Sonia Gandhi attending Ayodhya Ram Mandir ceremony

జనవరి 22న అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరుకావాలంటూ అన్ని పార్టీల ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి. వివిధ రంగాలకు చెందిన దాదాపు 6 వేల మంది ప్రముఖులను ఆహ్వానించారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, అధిర్ రంజన్ చౌదురీలకు కూడా ఇన్విటేషన్లు అందాయి. ఈ కార్యక్రమానికి సోనియాగాంధీ హాజరయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. మతపరమైన కార్యక్రమం కావడంతో సోనియా ఎలా రియాక్ట్ అవుతారో అని చాలా మంది సందేహాలు వ్యక్తం చేశారు. అయితే, ఆమె హాజరవుతున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రామ మందిరం ప్రారంభోత్సవం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Related posts

ఎయిరిండియా కీల‌క నిర్ణ‌యం.. ఇకపై తెలుగులోనూ కస్టమర్ కేర్ స‌ర్వీస్‌!

Ram Narayana

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది భక్తుల మృతి!

Ram Narayana

ఢిల్లీ-కోల్‌కతా హైవేపై భారీ ట్రాఫిక్ జామ్.. నాలుగు రోజులుగా రోడ్ల మీదే వాహనదారులు!

Ram Narayana