Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలుప్రమాదాలు ...

గుండెపోటుతో డ్రైవింగ్ సీటులోనే కన్నుమూసిన డ్రైవర్.. హైదరాబాద్ లో ఘటన

  • ప్రయాణికుడిని పికప్ చేసుకోవడానికి బయలుదేరిన డ్రైవర్
  • డివైడర్ పైకెక్కి ఆగిన కారు.. డ్రైవర్ ధనుంజయ మృతి
  • చాంద్రాయణగుట్టలో విషాదం
Car Driver Dead by Heart Attack In Hyderabad

కారు నడుపుతుండగా గుండెపోటుకు గురైన ఓ డ్రైవర్.. తన సీటులోనే తుదిశ్వాస వదిలిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ప్రయాణికుడిని పికప్ చేసుకోవడానికి వెళుతుండగా డ్రైవర్ గుండెపోటుతో చనిపోయాడు. నగరంలోని చాంద్రాయణగుట్టలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బడంగ్ పేట్ కు చెందిన జె.ధనుంజయ్ (41) ఓ ప్రైవేటు ట్రావెల్స్ లో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య, పదేళ్ల కూతురు, ఎనిమిదేళ్ల కొడుకు ఉన్నారు. రోజూలాగే శుక్రవారం ఉదయం డ్యూటీకి బయలుదేరిన ధనుంజయ్.. ట్రావెల్స్ ఆఫీసుకు చేరుకున్నాడు. పాతబస్తీ లాల్ దర్వాజ ప్రాంతంలో ఓ ప్రయాణికుడిని పికప్ చేసుకోవడానికి కారు తీసుకుని వెళ్లాడు.

నల్లవాగు సమీపంలోకి చేరుకున్న తర్వాత ధనుంజయ్ అస్వస్థతకు గురయ్యాడు. గుండె నొప్పిగా అనిపించడంతో ధోబీఘాట్ వద్ద కారును పక్కకు ఆపేందుకు ప్రయత్నించాడు. అయితే, కారును నియంత్రించలేకపోయాడు. దీంతో కారు డివైడర్ పైకెక్కి ఆగిపోయింది. మిగతా వాహనదారులు వచ్చి చూసేసరికి ధనుంజయ్ స్టీరింగ్ పై తలవాల్చేసి కనిపించాడు. స్థానికులతో కలిసి పోలీసులు ధనుంజయ్ ను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతను చనిపోయాడని వైద్యులు తెలిపారు. గుండెపోటు వల్లే ధనుంజయ్ ప్రాణం పోయిందని వివరించారు.  

Related posts

తుమ్మల తిరిగి మంత్రిగా రావడంతో భద్రాచలం రెండవ బ్రిడ్జి పనులు పరుగులు

Ram Narayana

వాళ్ల పేర్లు చెప్పాలని కవితపై ఒత్తిడి:ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

Ram Narayana

ఫైళ్ల మాయం కేసులో పోలీసుల ముందుకు తలసాని మాజీ ఓఎస్డీ

Ram Narayana

Leave a Comment