ఎంపీ వద్దిరాజు తిరిగి రాజ్యసభకు…!
అన్నమాట ప్రకారం బీఆర్ యస్ నుంచి పంపనున్న కేసీఆర్
రెండు సంవత్సరాల టర్మ్ కోసం రాజ్యసభకు వెళ్లిన వద్దిరాజు
త్వరలో ముగియనున్న వద్దిరాజు పదవీకాలం
అప్పుడే మరో ఆరు సంవత్సరాలు నువ్వే రాజ్యసభకు అన్న కేసీఆర్
ఎంపీ వద్దిరాజు తిరిగి రాజ్యసభకు… అన్నమాట ప్రకారం బీఆర్ యస్ నుంచి పంపనున్న కేసీఆర్ రెండు సంవత్సరాల టర్మ్ కోసం రాజ్యసభకు వెళ్లిన వద్దిరాజు త్వరలో ముగియనున్న వద్దిరాజు పదవీకాలం అప్పుడే మరో ఆరు సంవత్సరాలు నువ్వే రాజ్యసభకు అన్న కేసీఆర్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మరోసారి రాజ్యసభ కు వెళ్లనున్నారు అంటే అవుననే సమాధానమే వస్తుంది ….ఆయన్ను రాజ్యసభకు ఖాళీగా ఉన్న రెండు సంవత్సరాల పదవి కోసం బీఆర్ యస్ అధినేత కేసీఆర్ పంపారు …అప్పుడే కేవలం రెండు సంవత్సరాలే కదా …?మరో టర్మ్ కు నువ్వే వెళ్ళతావని స్వయంగా కేసీఆర్ మాట ఇచ్చారు ….దీంతో వద్దిరాజు పదవీకాలం త్వరలో ముగియనున్నది …తెలంగాణ నించి ముగ్గురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనున్నది …అందులో వద్దిరాజు ఒకరు …రేపు అయ్యే ఖాళీల్లో ఇప్పుడు అసెంబ్లీలో ఉన్న బలాబలాల ప్రకారం కాంగ్రెస్ కు రెండు , బీఆర్ యస్ కు ఒక సీటు దక్కే అవకాశం ఉంది …కాంగ్రెస్ పార్టీ ఎవరిని ఎంపిక చేస్తుందనిదే ఇక వాసన కూడా రావడంలేదు …త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేయాలని అనేక మంది నాయకులు తహతహ లాడుతున్నారు… దీంతో రాజ్యసభకు ఎవరరిని కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేస్తుంది అనేది ఏఐసీసీ పెద్దల చేతుల్లోనే ఉంటుంది ..అయితే రాష్ట్రానికి చెందినవారిని చేస్తారా …? లేక ఢిల్లీ ఇతరులను ఎంపిక చేస్తారా …? అనేది స్పష్టం కావాల్సి ఉంది …బీఆర్ యస్ లో మాత్రం ఒక్క సీటు కోసం పెద్దగా వత్తిడి ఉండకపోవచ్చు …దీంతో వద్దిరాజు ఎంపిక ఖాయమనే అభిప్రాయాలే వ్యక్తం అవుతున్నాయి….ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో వద్దిరాజు పార్టీ కోసం తీవ్రంగా కష్టపడ్డారు …ఖమ్మం జిల్లాలో ఫలితాలు ప్రతికూలంగా ఉండటంతో పార్టీ ఓడిపోయింది …వద్దిరాజు కమిట్ మెంట్ ను కేసీఆర్ గుర్తించారు …బలమైన సామాజికవర్గానికి చెందిన బీసీ నేతగా ఉండటం ఆసామాజిక వర్గంలో ఆయనకు మంచి పట్టు ఉండటంతో వద్దిరాజు బీఆర్ యస్ అధినేత కేసీఆర్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ లుక్స్ లో ఉన్నారు …ఏదైనా కారణాల వల్ల వద్దిరాజును లోకసభకు పోటీచేయించాలని కేసీఆర్ భావిస్తే తప్ప బీఆర్ యస్ నుంచి రాజ్యసభకు వద్దిరాజు తిరిగి వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది…..