Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఖమ్మం పార్లమెంట్ ను ఆశిస్తున్న మంత్రుల కుటుంబసభ్యులు …

ఏదైనా రాజకీయాలు తలకిందులైతే తప్ప ఖమ్మం లోకసభ సీటు కాంగ్రెస్ ఖాతాలో పడినట్లే …ఖమ్మం లోకసభ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు స్థానాల్లో కాంగ్రెస్ , ఒక స్థానంలో మిత్రపక్షం సిపిఐ ఘన విజయం సాధించాయి…కాంగ్రెస్ కు లోకసభ పరిధిలో 2 లక్షల 50 వేల ఓట్ల మెజార్టీ వచ్చింది .. …దీంతో ఎవరు పోటీచేసిన సునాయాసంగా గెలిచే సీటు అవ్వడం …ముగ్గురు మంత్రులు ఈ నియోజకవర్గ పరిధిలో ఉండటంతో పోటీ చేయాలనీ ఉవ్విళ్ళు ఊరుతున్న వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది …అందులో జిల్లా మంత్రుల కుటుంబసభ్యులు పోటీకోసం పావులు కదుపుతున్నారు … డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అంగీకరిస్తే “మల్లు నందిని” మేడం పోటీచేస్తారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి…అయితే ఇక్కడ సామజిక వర్గాల సమీకరణాల చర్చ కూడా ప్రధానంగా ఉంది …రాష్ట్రంలో కమ్మ సామాజికవర్గానికి సీటు ఇవ్వాల్సి వస్తే ఖమ్మంలో ఆ సామాజికవర్గం ఓటర్లు అధికంగా ఉన్నాయి …అందువల్ల సహజంగానే వారు ఖమ్మం పార్లమెంట్ సీటును పట్టుబట్టడం ఖాయం ……

మంత్రి తుమ్మల తనయుడు డాక్టర్ యుగంధర్ ప్రధాన పోటీదారుగా ఉన్నారు …ఇప్పటి నుంచే ఆయన ఖమ్మం ఎంపీగా పోటీచేసేందుకు పావులు కదుపుతున్నారు … అయితే అదే సామాజికవర్గానికి చెందిన బజాజ్ సంస్థల అధినేత వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ కూడా హడావుడి చేస్తున్నారు …గత ఎన్నికల సందర్భంగా ఆయన బీఆర్ యస్ నుంచి ఖమ్మం ఎంపీ టికెట్ ఆశించారు …అయితే నామ నాగేశ్వరావు టీడీపీ నుంచి బీఆర్ యస్ లో చేరడంతో దాదాపు రాజాకు ఖాయమైన సీటు నామ కు ఇచ్చారు ..ఇప్పుడు కాంగ్రెస్ తరుపున ట్రయిల్స్ వేస్తున్నారు … కమ్మ సామాజికవర్గానికి చెందిన మాజీ ఎంపీ రేణుక చౌదరి కూడా ఖమ్మం సీటు నాదే అంటున్నారు … …

కాంగ్రెస్ పార్టీలో కొద్దీ కాలంలోనే కీలకనేతగా ఎదిగిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి పేరు కూడా ప్రచారంలో ఉంది …. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రసాద్ రెడ్డి పాలేరు నియోజకవర్గంలో తన అన్న గెలుపులో కీలకంగా వ్యవహరించారు …ఎన్నికల్లో మంచి అనుభవం సాధించారు …ఆర్థిక ,అంగబలం ఉంది …అయితే ఈ సీటు కమ్మ సామాజికవర్గానికి కేటాయిస్తే ప్రసాద్ రెడ్డికి నిరాశ తప్పదు …

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని పేరు కూడా ప్రచారంలో ఉంది…గత ఎన్నికల్లో కూడా ఈమె పేరు కాంగ్రెస్ పార్టీ తరుపున వినిపించినా అప్పుడు సీఎల్పీ నేతగా ఉన్న భట్టి విక్రమార్క నిర్ద్వద్వంగా తోసిపుచ్చారు …ఇప్పుడు ఆయన రాష్ట్ర రాజకీయాల్లో డిప్యూటీ సీఎం గా రాష్ట్ర ఆర్థిక, విద్యుత్ శాఖల మంత్రిగా కీలకంగా వ్యవహరిస్తున్నారు …ఆయన పరోక్షంలో ఆమె నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారు …హాస్పటల్ ,విద్య ,ఉద్యోగాల కోసం ఆమె ఎవరు వచ్చి అడిగిన సహాయం చేస్తుంటారు …అంతేకాకుండా ఆమె “అమ్మ పౌండేషన్” అనే స్వచ్చంద సంస్థను నడుపుతున్నారు …అందుకే ఆమెను నియోజకవర్గంలో అందరు “అమ్మ” అని పిలుస్తుంటారు …

ఆమె మధిర నియోజకవర్గంలో గడపగడపకు చిరపరిచితురాలు …కులమతాలకు అతీతంగా అందరితో కలుపుగోలుగా ఉంటారనే పేరుంది … నియోజకవర్గ ప్రజలు తమ ఆడపడుచుగా ఆమెను స్వాగతిస్తుంటారు … భట్టి ఉన్న లేకపోయినా ఆమె నిరంతరం నియోజకవర్గంలో పర్యటిస్తూ ,ప్రజలకు అందుబాటులో ఉంటారు …వారికీ ఏ సమస్య వచ్చిన నేను ఉన్నానని భరోసా ఇస్తుంటారు …పైగా మహిళగా , హిందీ ,ఇంగ్లీష్ భాషల్లో పట్టున్న వ్యక్తిగా అదనపు అర్హతలు ఉన్నాయి…ఆమె అభ్యర్థిత్వాన్ని డిప్యూటీ సీఎం భట్టి అంగీకరిస్తారో లేదో అనే సందేహాలు ఉన్నాయి…

ఆమెకు మాత్రం ప్రజలకు సేవ చేయాలనే తపన బలంగా ఉంది …కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమె జిల్లాలో వివిధ ప్రాంతాలు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు …దీంతో ఆమె పోటీచేస్తారని ప్రచారం జరుగుతుంది…

ఇటీవల ఆశ్వారావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలం కేంద్రంలో పర్యటించారు … ఇందిరా గాంధీ విగ్రహానికి మరియు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు .. ఆమె వెంట వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్ ఉన్నారు … అక్కడ ఆమె సేవాదళ్ శతాబ్ది ఉత్సవాలు సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు …వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్ తో కలసి కేక్ కట్ చేసి సేవాదళ్ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు…ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు అనుబంధ సంఘాలు నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు…

Related posts

కాంగ్రెస్ 420 హామీల పేరుతో బీఆర్ఎస్ బుక్‌లెట్ విడుదల

Ram Narayana

కోహ్లీ తన రికార్డును సమం చేయడం పట్ల సచిన్ స్పందన

Ram Narayana

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు త్రీబుల్ ధమాఖా …భట్టి ,తుమ్మల, పొంగులేటికి కీలక పదవులు ..

Ram Narayana

Leave a Comment