Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

షర్మిలకు ఏఐసీసీలో కీలక భాద్యతలు అప్పగించనున్నారా…?

వైయస్సార్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరటం దాదాపు ఖాయం అయింది … ఈ మేరకు మంగళవారం లోటస్ పాండ్ లో జరిగిన పార్టీ నాయకుల కార్యకర్తల సమావేశంలో ఆమె కాంగ్రెస్ లో చేరికపై నేతలకు స్పష్టతనిచ్చారు… అయితే ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తారా లేదా అనే విషయం ఇంకా ఇతిమిద్దంగా తేలలేదు … ఆమె జాతీయ రాజకీయాల్లో కీలక పదవి అప్పగించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కీలకంగా వ్యవహరించే విధంగా పదవి బాధ్యతలు అప్పగించనున్నారు అని ప్రచారం జరుగుతుంది… వైయస్ షర్మిల తెలంగాణలో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని తీసుకొస్తానని సంక్షేమ రాజ్యాన్ని అమలు చేస్తానని పార్టీ పెట్టారు… గత మూడు,నాలుగు సంవత్సరాలుగా పార్టీని నడుపుతున్నారు… అయితే ఆమె అనుకున్న స్థాయిలో రాష్ట్ర ప్రజల నుండి మద్దతు లభించలేదు … పాదయాత్ర చేశారు నిరుద్యోగ సమస్యపై ఆందోళన నిర్వహించ మంగళవారం, మంగళవారం దీక్షల ద్వారా రాష్ట్రంలో ఒక వినూత్నప్రచారాన్ని ప్రారంభించారు… అనేక విమర్శలను ఎదుర్కొన్నారు… ఆటుపోట్లను ఎదుర్కొన్నారు … తాను అనుకున్న లక్ష్యం చేరాలని ఉద్దేశంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటం ద్వారా కొన్ని అసెంబ్లీ సీట్లు తన అనుయాయులకు ఇప్పించుకోవటంతో పాటుగా తాను కూడా ఖమ్మం జిల్లాలోని పాలేరు లేదా నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ నుండి పోటీ చేయాలని భావించారు … అంతకుముందే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు…అక్కడ క్యాంప్ కార్యాలయ నిర్మా ణానికి భూమి పూజ చేశారు… అదే స్థలంలో రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు… రాష్ట్రంలో 3700 కిలోమీటర్ల పైగా పాదయాత్ర నిర్వహించారు… ఈ పాదయాత్రలో అనేక అడ్డంకులు ఎదురైనప్పటికీ ఆమె మొక్కవోని దీక్షతో పాదయాత్రలో పాల్గొన్నారు… అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్లో చేరుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది …ఆమె కూడా అదేవిధంగా సంకేతాలు ఇచ్చారు …కానీ ఎక్కడో బెడిసి కొట్టింది … తెలంగాణ కాంగ్రెస్ లోని కొందరు నేతలు ఆమె చేరికను అడ్డగించారు …ఇక చేసేది లేక ఆమె పార్టీలో చేరిక ఆగిపోయింది …ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతుగా ఆమె పోటీ చేయకుండా తన అభ్యర్థులను పెట్టకుండా ఉన్నారు…తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే ఫార్మాలను అవలంబించాలని చూస్తున్నారు … ఆంధ్రప్రదేశ్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెను ఉపయోగించుకోవాలని వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు … ఆ రాష్ట్రంలో ప్రచారం చేయటానికి రావాలని ఆమెను అక్కడ కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు… అంతే కాకుండా ఆమె వస్తే ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు ఆమెకి అప్పగిస్తామని చెప్తున్నారు … అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది …. ఆమె ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్వయానా చెల్లెలు కావడం తో అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె ప్రచారం చేస్తే ఉపయోగం ఉంటుందనే అభిప్రాయం కాంగ్రెస్ నేతల్లో ఉంది … ఆమె కూడా ఈ మేరకు నాలుగో తేదీన ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది… అయితే ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి పాత్ర నిర్వహిస్తారు ఆమెకు ఎలాంటి పదవి ఏఐసిసి అప్పగిస్తుంది… అనేది ఆసక్తికరంగా మారింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈసారి కొత్త ఎత్తుగడలతో ముందుకు పోతుంది … అందులో భాగంగానే కర్ణాటక, తెలంగాణలో వచ్చిన ఫలితాల ఆధారంగా ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాకర్షక పథకాలు ద్వారా ప్రజలును తమ వైపుకు తిప్పుకోవాలని చూస్తంది …చూద్దాం ఏమిజరుగుతుందో…..

షర్మిల చేరికను అధికారికంగా ప్రకటించిన వైయస్సార్ టీపీ

కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేరబోతున్నారనే వార్తల్లో పూర్తి క్లారిటీ వచ్చింది. ఈరోజు లోటస్ పాండ్ లోని కార్యాలయంలో పార్టీ కీలక నేతలతో షర్మిల భేటీ అయ్యారు. కాంగ్రెస్ లో పార్టీ విలీనంపై చర్చించారు. ఈ సందర్భంగా వైఎస్సార్టీపీ ప్రధాన కార్యదర్శి తూడి దేవేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… గురువారం నాడు కాంగ్రెస్ లో షర్మిల చేరుతున్నారని చెప్పారు. ఆమెకు ఏఐసీసీలో కీలక పదవి దక్కే అవకాశం ఉందని అన్నారు. పార్టీలోని నేతలకు కూడా పదవులు వస్తాయని చెప్పారు. 

మరోవైపు, ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు షర్మిలకు అప్పజెప్పనున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ నేపథ్యంలో పలువురు నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) కూడా షర్మిలతో కలిసి నడుస్తానని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

Related posts

విభజన చట్టంలోని అంశాలు రాష్ట్రాలు పరిష్కరించుకోవాల్సిందే …కేంద్రం

Ram Narayana

జర్నలిస్ట్‌ను కొట్టింది నిజమే… అందుకు చింతిస్తున్నాను కానీ: మోహన్ బాబు

Ram Narayana

నారాయణ కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్య?

Ram Narayana

Leave a Comment