Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

రాష్ట్రంలో జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు…సమాచార శాఖ మంత్రి పొంగులేటి

రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు… రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు… అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామన్నారు …. ఖమ్మం జర్నలిస్టులతో మంగళవారం ఎస్సార్ కన్వెన్షన్ లో ఏర్పాటుచేసిన చిట్ చాట్ కార్యక్రమంలో పొంగులేటి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతూన్న కార్యక్రమాలు ఆరు గ్యారంటీ పథకాలు అమలు ,రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రతిపక్షాల హుంకరింపులపై ఘాటుగా స్పందించారు .. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు …అయినప్పటికీ పథకాల అమల్లో వెనక్కి తగ్గేది లేదని అన్నారు ….ప్రభుత్వం ఏర్పడిన 24 గంటల లోపే రెండు పథకాలు అమలు చేసిన విషయాన్నీ గుర్తు చేశారు …రాష్ట్రంలో ఏ ఒక్కరు ఇబ్బంది పడకూడదనేది తమ ప్రభుత్వ ఉద్దేశమని దాని కనుగుణంగా కార్యాచరణ రూపొందిస్తామన్నారు… హైద్రాబాద్ లో అనేకమంది జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు తనను కలిసి ఇళ్ల స్థలాల సమస్యపై విజ్ఞాపనలు అందజేశారని అందుకు అనుగుణంగా తాము ముఖ్యమంత్రితో చర్చించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటామన్నారు….ఖమ్మం జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయం అధికారులతో చర్చించి పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు… ఇప్పటికే ఖమ్మం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తూ వచ్చిన జీవో ప్రకారం వారికి స్థలాలు కేటాయించడం జరుగుతుందన్నారు … అదేవిధంగా రేటు కూడా తగ్గించేందుకు ఉన్న అవకాశాలు అధికారులతో చర్చించి తగ్గించే ప్రయత్నం చేస్తామని అన్నారు ….

చిట్ చాట్ కార్యక్రమంలో మంత్రి అనేక విషయాలు జర్నలిస్టు ద్వారా తెలుసుకొని వాటికి పరిష్కారం మార్గాలను త్వరలోనే చూస్తామన్నారు… టి యు డబ్ల్యూ జై రాష్ట్ర ఉపాధ్యక్షులు కే రామనారాయణ జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వరరావు , రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మాటేటి వేణు,ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్ , నలజాల వెంకట్రావు , నాగేందర్, నాగేందర్ రెడ్డి, టీజేఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ,ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి తదితరులు సమావేశంలో అనేక విషయాలు మంత్రి దృష్టికి తెచ్చారు….

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఖమ్మం కేంద్రంగా ఉన్న సమాచార శాఖ ఏడి కార్యాలయాన్ని ఇక్కడ నుంచి తరలించి వేరే చోటికి పంపించడం పై జర్నలిస్టులు నాటి నుండి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు… తిరిగి ఏడి కార్యాలయాన్ని ఖమ్మంలో ఏర్పాటు చేయాలని మంత్రులకు అనేకమార్లు విజ్ఞప్తి చేశారు… అయినా ఫలితం లేకపోవడంతో తిరిగి సమాచార శాఖ మంత్రిగా నియమితులైన ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకొచ్చారు… ముగ్గురు మంత్రులు ఉన్నందున ఏ డి కార్యాలయం ఉంటే పని భారం తగ్గుతుందని, ప్రోటోకాల్ కూడా పాటించేందుకు అవకాశాలు ఉంటాయని, అందువల్ల ఏ డి కార్యాలయం తో పాటు సిబ్బంది, వాహనాల సంఖ్య పెరిగి ఖమ్మంలో మంత్రుల పర్యటనలకు తగిన న్యాయం జరుగుతుందన్నారు …. అదేవిధంగా జర్నలిస్టుల సమస్యలను కూడా అడ్రస్ చేయవచ్చునని జర్నలిస్టు ప్రతినిధులు మంత్రి దృష్టికి తెచ్చారు… దీనిపై వెంటనే స్పందించిన మంత్రి పొంగులేటి త్వరలోనే ఖమ్మం కు ఏ డి కార్యాలయాన్ని రప్పిస్తానని హామీ ఇచ్చారు…ఈ శాఖ మనదే అయినందున పెద్ద సమస్య ఉండబోదని అధికారులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటానని అన్నారు… అదేవిధంగా హెల్త్ కార్డులు, సంక్షేమ పథకాలు అమలుపై తగిన విధంగా చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని జర్నలిస్ట్ లను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని అన్నారు…గతంలో జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులు ప్రస్తావించగా పరిశీలించి తగిన విధంగా న్యాయం చేస్తామన్నారు … కొంతమంది పాలకులు కక్షపూరితంగా వ్యవహరించి జర్నలిస్టులపై కేసులు పెట్టడం సరైన కాదని అభిప్రాయంతో మంత్రి ఏకీభవించారు … కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న విలేకరులు ఎవరైనా వారి వివరాలు తీసుకొని కేసుల పూర్వాపరాలు చర్చించి వాటిపై తగిన విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు ….

Related posts

నాపై నమోదైన అక్రమ కేసు కొట్టివేయండి: హైకోర్టులో మల్లారెడ్డి పిటిషన్

Ram Narayana

హైదరాబాద్‌లోనూ హిజాబ్ వివాదం.. హోం మంత్రి మహమూద్ అలీకి ఫిర్యాదు..!

Drukpadam

తెలంగాణను కీలక స్థావరంగా ఎంచుకున్న నావికాదళం… వికారాబాద్ జిల్లాలో నేవీ రాడార్ స్టేషన్

Ram Narayana

Leave a Comment