Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కేసీఆర్ నివాసానికి చేరుకున్న జగన్.. ఆహ్వానం పలికిన కేటీఆర్

  • కేసీఆర్ ను పరామర్శించిన జగన్
  • కేసీఆర్ నివాసంలో గంటపాటు గడపనున్న ఏపీ సీఎం
  • లంచ్ మీటింగ్ ఉన్నట్టు సమాచారం

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఆయన బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వచ్చారు. ఎయిర్ పోర్టులో బీఆర్ఎస్ నేతలు జగన్ కు స్వాగతం పలికారు. అనంతరం జగన్ అక్కడి నుంచి నేరుగా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో ఉన్న కేసీఆర్ నివాసానికి వెళ్లారు. కేసీఆర్ నివాసం వద్ద జగన్ కు కేటీఆర్ ఆహ్వానం పలికి, లోపలకు తీసుకెళ్లారు. ఇటీవల ఆపరేషన్ చేయించుకున్న కేసీఆర్ ను జగన్ పరామర్శించారు. దాదాపు గంటసేపు కేసీఆర్ నివాసంలో జగన్ గడపనున్నారు. లంచ్ మీటింగ్ కూడా ఉందని తెలుస్తోంది. వీరి మధ్య రాజకీయ చర్చలు జరిగే అవకాశం ఉంది. 

Related posts

ముక్కోటికి భద్రాద్రి రావద్దు:కలెక్టర్

Drukpadam

క‌రోనా నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తూ గుర్రం అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన్న వంద‌లాది మంది.. క‌ర్ణాట‌క‌లో ఘ‌ట‌న‌

Drukpadam

సర్పంచ్ అభ్యర్థులకు రాత పరీక్ష!

Drukpadam

Leave a Comment