ఏపీలో వైసీపీకి షాకుల మీద షాకులు …పార్టీకి గుడ్ బై చెపుతున్న ఎమ్మెల్సీలు ,ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీ రాంచంద్రయ్య పార్టీకి గుడ్ బై
జగన్ సర్కార్ పై సొంతపార్టీ నేతల్లోని తీవ్ర అసంతృపి
పార్టీ మారేనుకు సిద్ధపడుతున్న మరికొంతమంది ..
కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధపడ్డ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
పెనమలూరు ఎమ్మెల్యే పొలుసు పార్థసారధి పార్టీ మారతారని ప్రచారం ..
పార్టీకి అందుబాటలోలేని విజయవాడ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్ , మల్లది విష్ణు
పార్టీని విడతానన్న ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి …
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి….ఒక పక్క ప్రత్యర్థి పార్టీలనుంచి వస్తున్న విమర్శల జడివానలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీకి …మరో , సొంతపార్టీ నేతల నుంచి అసంతృప్తులు వ్యక్తం కావడం పార్టీని చిక్కుల్లోకి నెడుతుంది….నిన్నమొన్నటివరకు ఎవరెన్ని అనుకున్న అధికారంలోకి వస్తుందనుకున్న సొంతపార్టీ నేతలకే నమ్మకం సన్నగిల్లి పక్క చూపులు చూస్తున్నారు …దీంతో రాష్ట్రంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి…. మరి కొద్ది నెలల్లో పార్లమెంట్ తోపాటు రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనుండగా జరుగుతున్న ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాలను తీవ్ర ప్రభావం చేసే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు…
ఇప్పటికే అనేకమంది వైసీపీ నేతలు అధికార పార్టీ వీడి ప్రతిపక్ష టిడిపిలోనూ, కాంగ్రెస్ లోనూ చేరుతున్నారు… ప్రధానంగా వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ శ్రీ రామచంద్రయ్య చంద్రబాబు సమక్షంలో టిడిపి కండవు కప్పుకున్నారు … అదేవిధంగా విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కూడా టిడిపిలో చేరారు… వైసిపి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధపడ్డారు…ఆయన వైసీపీ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు… తాను వైయస్ షర్మిల బాటలోనే నడుస్తానని మంగళగిరిలో పోటీ విషయం ఆమె చెప్పినట్లే నడుచుకుంటానని ప్రకటించారు … కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు … కృష్ణా జిల్లాకు చెందిన మాజీమంత్రి పులుసు పార్థసారథి పార్టీని వీడి టిడిపిలో చేరుతున్నారని వార్తలు వస్తున్నాయి …నేడు సీఎం జగన్ కలిసేందుకు తాడేపల్లి వచ్చిన రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి సీఎం అపాయింట్మెంట్ దొరకలేదు సరికదా నీకు టికెట్ ఇవ్వడంలేదని సజ్జల చెప్పడంతో ఆయన పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు … అనేకమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించడం కొందరిని వారి నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి బదిలీ చేయడం లాంటి సమస్యలతో వైసీపీ నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నది … జగన్ తన సొంత నిర్ణయాలతో మూర్ఖంగా పార్టీని నాశనం చేస్తున్నారని రానున్న రోజుల్లో పార్టీకి తీవ్ర వ్యతిరేక ప్రభావం చూపే అవకాశం ఉందని పార్టీ నేతలు నెత్తి నోరు మొత్తుకుంటున్నారు… అయినప్పటికీ జగన్ తన విధానాన్ని మార్చుకోకపోవడంపై పార్టీ నేతలు రగిలి పోతున్నారు … ఇప్పటికే అనేకమంది బావాటంగానే జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు… ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నెల్లూరుకు చెందిన ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి , శ్రీధర్ రెడ్డి , మేకపాటి చెంద్రశేఖర్ రెడ్డి లు ,తాడికొండకు చెందిన శ్రీదేవి వైసీపీని వీడి టిడిపి తీర్థం పుచ్చుకున్నారు… ఒక్క నెల్లూరు జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారడం సంచలనంగా మారింది… అయినప్పటికీ జగన్ వైఖరిలో మార్పు లేదని ఫలితం అనుభవించక తప్పదని అంటున్నారు … ఆయన సరి చేసుకోవాల్సిన అంశాలను సరి చేసుకోకుండా నాయకులపై రుద్దే ప్రయత్నం చేయటం ఆయన అహంకారానికి నిదర్శమనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి…. ఇలాంటి రాజకీయాలు పనికిరావని అంటున్నారు… కేవలం నా పార్టీ నేను అనే తల బిరుసు, అహంకారం ఆయనను రాజకీయంగా పతనం కావడం ఖాయం అనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి .. పైగా సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందిస్తున్నాను కాబట్టి వారంతా తమకే ఓటేస్తారని అందువల్ల తిరిగి ఎన్నికల్లో గెలుపొందడం ఖాయమని భావిస్తున్నారని ఇది జరిగే పని కాదని సంక్షేమ పథకాలు అమలు వేరు, ప్రజల మనుసులు గెలుసుకోవడం వేరని వైసీపీ నేతలు అంటున్నారు… అనేక సందర్భాల్లో ఆయనకు తమ అభిప్రాయాలు చెప్పేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదని ఫలితంగా తమ దారి తాము చూసుకోకుండా ఉండలేకపోతున్నామని వారు పేర్కొంటున్నారు…
ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి పై నమ్మకంతో 151 సీట్లు గెలిపించి అధికారం కట్టబెడితే ప్రజారంజక పాలన అందించాల్సింది పోయి కక్షపూరిత రాజకీయాలకు పూనుకున్నారనే అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకు పోయింది… ఫలితంగా జనంలో ఇది వ్యతిరేకతను పెంచిందని దానికి తోడు ప్రతిపక్షాలు కూడా నిరంతరం ప్రజలను జగన్ పై వ్యతిరేక భావాన్ని పెంచడంలో సక్సెస్ అయ్యాయని పేర్కొంటున్నారు… అందువల్ల రానున్న ఎన్నికల్లో జగన్ పార్టీ తిరిగి అధికారంలో రావడం కష్టంగానే ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..
వై నాట్ 175 సీట్లు అంటూ జగన్ చేస్తున్న ప్రచారం పార్టీలోని విశ్వాసాన్ని కలిగించలేకపోతుందని అభిప్రాయాలు ఉన్నాయి… కేవలం జగన్ వ్యవహార శైలి పరిపాలన పట్టుతప్పడం.. అమరావతి రాజధాని తరలింపు దాని కోసం కోర్టుల చుట్టూ తిరగటం, మూడు రాజధానుల అంశాన్ని తీసుకురావడం పై ప్రజల్లో కన్ఫ్యూజన్ ఉంది…. పైగా ఎక్కడైతే రాజధాని పెట్టాలని అనుకుంటున్నారో ఆ విశాఖ నుంచి అనేకమంది వైసీపీ నేతలు పార్టీ మారడం గమనించదగ్గ అంశం .. విశాఖలో రాజధాని పెడతానని చెప్పిన తర్వాత కూడా అక్కడ వైసీపీని విశ్వసించకుండా ఆపార్టీ ఎమ్మెల్సీ జనసేన తీర్థం పుచ్చుకున్నారు … అదేవిధంగా మరి కొంత మంది ఎమ్మెల్యేలు వైసిపినీ వీడేందుకు సిద్ధంగా ఉన్నారు … ఈ రాజకీయ పరిణామాల్ని గమనిస్తే రేపు రానున్న అసెంబ్లీ ,పార్లమెంట్ ఎన్నికల్లో జగన్ పార్టీ భారీ నష్టాన్ని చవిచూసే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు …
రాష్ట్ర రాజకీయాల్లో ఒక హీరోగా గుర్తింపు పొంది తిరుగులేని నాయకుడిగా 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన జగన్ తన తప్పిదాల వల్ల తిరిగి అధికారం కోల్పోయే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి… అయినప్పటికీ వైసీపీ తన వైఖరిని మార్చుకోకుండా మార్పులు చేర్పుల పేరుతో కాలయాపన చేస్తూ ఉన్న నాయకులను కన్ఫ్యూజన్ గురి చేస్తూ వారు అసంతృప్తికి గురై పార్టీని ఈడేందుకు సిద్ధమవుతున్నారు … ఇప్పటికే అనేకమంది నేతలు అజ్ఞాతంలోకి వెళ్ళగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తనకు టికెట్ ఇవ్వకుండా వేరే వారిని ఇన్చార్జిగా పెట్టడంపై అసంతృప్తితో తాడేపల్లి వచ్చారు… అక్కడ పార్టీ పెద్దలను కలిశారు … తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని వేడుకున్నారు … అయినప్పటికీ పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కు తగ్గే ప్రశ్న లేదని ఆయనకు అక్కడ మైనస్ ఉందని తిరిగి ఆయన్ను పోటీ పెడితే గెలిచే అవకాశాలు లేవని చెప్పినట్లు తెలుస్తుంది… ఈ విధంగానే అనేకమంది నాయకులపై సొంత సర్వేలు ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా పార్టీ అభ్యర్థుల ఎంపిక ఇన్చార్జిలుగా నియమించడం లాంటి చర్యలకు వైసీపీ కసరత్తులు చేస్తుంది.. జగన్ చేస్తున్న ఈ రాజకీయ క్రీడలో అనేకమంది సమిధలు కాబోతున్నారని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి… అందువల్ల వైసిపిని నమ్ముకుంటే నట్టేట మునగటమేనని, మరో దారి చూసుకోవటం మంచిదనే అని అభిప్రాయాలతో పలువురు నేతలు వేరే పార్టీల్లో చేరేందుకు క్యూ కడుతున్నారు.. ఇప్పటికైనా జగన్ తన వైఖరిని మార్చుకొని రాజకీయ నిర్ణయం పార్టీ నాయకులతో పంచుకొని నిర్ణయాలు తీసుకుంటే కొంతలో కొంతైనా మెరుగుపడే అవకాశం ఉందని లేకపోతే పెద్ద నష్టం జరగక తప్పదని హెచ్చరికలు చేస్తున్నారు పరిశీలకులు …