- అట్లూరి ప్రియతో షర్మిల తనయుడు రాజారెడ్డి వివాహం
- ఈ నెల 18న నిశ్చితార్థం… ఫిబ్రవరి 17న వివాహం
- రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి పెళ్లి పత్రికను అందించిన షర్మిల
ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిల శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి… తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి నివాసంలో ఆయనను కలిసిన షర్మిల… తన తనయుడు రాజారెడ్డి ఎంగేజ్‌మెంట్, వివాహానికి ఆహ్వానించారు. ఈ మేరకు ఆమె పెళ్లి పత్రికను ముఖ్యమంత్రికి అందించారు. ఈ నెల 18న అట్లూరి ప్రియతో షర్మిల తనయుడి నిశ్చితార్థం… ఫిబ్రవరి 17న వివాహం జరగనున్నాయి. ఈ నేపథ్యంలో షర్మిల పలువురికి వివాహ ఆహ్వాన పత్రికను అందిస్తున్నారు. ఇటీవల ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద తొలి ఆహ్వాన పత్రికను ఉంచి.. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులు తీసుకున్నారు. ఆ తర్వాత తన సోదరుడు, ఏపీ సీఎం జగన్‌ను కలిసి పెళ్లికి ఆహ్వానించారు. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి పత్రికను అందించారు.