Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

దశలవారీగా రైతుబంధు… వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందజేస్తున్న రైతుబంధు పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయాలని కొత్తగా అధికారులకు వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది… అందుకు అనుగుణంగా రైతులకు రైతుబంధు వేయాలని నిర్ణయించు కుంది… రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతుబంధు ఎలాంటి జాప్యం ఉండకూడదని అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు దారి చేశారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు వ్యవసాయ మంత్రి తుమ్మల ఉన్నత స్థాయి అధికారుల సమావేశం నిర్వహించి రైతుబంధుపై సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలో దాదా పు 60 లక్షల పైగా రైతులకు రైతుబంధుతుందని దానిలో భాగంగా ఇప్పటివరకు 27 లక్షల మంది రైతులకు రైతుబంధు అందచేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు… రైతుబంధు విషయంలో రైతులకు ఎలాంటి అపోహలకు వెళ్ళొద్దని ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని అందువల్ల ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రైతుబంధు ఇచ్చి తీరుతామని ఆయన అన్నారు…

తమ ప్రభుత్వం… రైతుబంధును ఎగ్గొట్టేందుకే చర్యలు తీసుకుంటుందని టిఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు… ఎన్నికల్లో రైతులకు ఎకరా 15000 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిందని అందుకని అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు… ఇందులో ఎలాంటి అపోహలకు తావు లేదన్నారు… తమ ప్రభుత్వం వచ్చిన మూడో రోజు న 6 గ్యారంటీల్లో రెండు గ్యారెంటీలు అమలు చేసి మాట నిలబెట్టుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు… 6 గ్యారంటీ లను కచ్చితంగా అమలు చేసి తీరతామని అందుకు ఎన్ని ఆటంకాలు ఇబ్బందులు ఎదురైనా వెనక్కి వెళ్లే ప్రశ్నే లేదని మంత్రి స్పష్టం చేశారు ..

కొంతమంది కాంగ్రెస్ పథకాలు అమలు కాకూడదని కోరుకుంటున్నారని వారి దుర్బుద్ధికి ఇది నిదర్శనమని ఆయన ఘాటుగా స్పందించారు… ఎవరైనా అధికార పార్టీ ప్రజలకు మరింత మేలు చేయాలని అందుకు తగిన సూచనలు చేస్తే సంతోషిస్తామని కానీ పథకాలే అమలు కాకూడదని కోరుకునే ప్రబుద్ధులు కూడా ఉంటారని ఇప్పుడే అర్థమైందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు ఇలాంటి తుచ్ఛా రాజకీయాలు చేయవద్దని తుమ్మల హితవు పలికారు …

Related posts

ఎమ్మెల్యేలకు కేసీఆర్ భరోసా …మీకేం కాదులే నేనున్నానని హామీ…!

Ram Narayana

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ఆత్మహత్య చేసుకుంటా…..జోగు రామన్న

Drukpadam

సీఎం కేసీఆర్​ సంచలన నిర్ణయం.. ప్రొఫెసర్​ హరగోపాల్‌పై ఉపా కేసు ఎత్తివేత!

Drukpadam

Leave a Comment