మధిర అంటే నాకు ప్రాణం…మధిర ప్రజలు తలెత్తుకునేలా పాలన చేస్తా…డిప్యూటీ సీఎం భట్టి !
ప్రజలకు సేవకుడిగా పని చేస్తా…అప్పుల రాష్ట్రాన్ని గట్టేక్కిస్తాం
విద్యుత్ ఉత్పత్తి పెంచి వెలుగులు పంచుతా
తెలంగాణ ప్రజల కలలు నిజం చేయడమే ఇందిరమ్మ ప్రజా పాలన లక్ష్యం
ప్రశ్నించే వాడిగా… పాలించే వాడిగా ఏ పదవి చేపట్టిన వన్నె తెచ్చాను
మధిర అభివృద్ధికి నిరంతరం పని చేస్తా
మధిరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు గ్రాండ్ వెల్కమ్..
భట్టి రాకతో జన సందోహంగా మధిర
బట్టి దంపతులకు గజమాలతో సత్కారం
పూల వర్షం కు రిపించిన అభిమానులు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చెందిన మల్లు భట్టి విక్రమార్క తొలిసారి మధిర కు వచ్చిన సందర్భంగా మధిరలోపట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు… గతంలో ఎన్నడూ లేని విధంగా తమ అభిమాన నేత రాకకోసం ప్రజ లు ఎదురు చూశారు… ఎర్రుపాలెం మండలంలో ని వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నడిప్యూటీ సీఎం మధ్యాహ్నం మధిర కు చేరుకున్నారు ..మధిరలో ప్రజలు పెద్ద ఎత్తున పూల వర్షం కురిపించారు … గజమాలతో భట్టితోపాటు ఆయన సహధర్మాచారని నందిని గజమాలతో సత్కరించారు … దీనికోసం పెద్ద క్రేయిన్ ఉపయోగించారు… ఆయా రాజకీయ పక్షాల పార్టీల నాయకులు శాలువాలు కప్పి, పూల దండలు వేసి ఘనంగా సన్మానం చేశారు. తమ అభిమాన నేత డిప్యూటీ సీఎం అయునతర్వాత మొదటిసారిగా మధిర కు రావడం ఎంతో అందంగా ఉందని పలువురు పేర్కొన్నారు…
ప్రజలు ఇచ్చిన అధికారంతో విర్ర వీగకుండా వెన్నులో భయం పెట్టుకొని ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు సేవకుడిగా పని చేసి అప్పుల రాష్ట్రాన్ని గట్టేక్కిస్తానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. శనివారం రాత్రి మధిర నియోజకవర్గ కేంద్రంలోని రెడ్డి గార్డెన్ ఎదురుగా కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌర సన్మాన కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆయన సతీమణి నందిని విక్రమార్కతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రజల ఉద్దేశించి భట్టి ప్రసంగిస్తూ … డిప్యూటీ ముఖ్య మంత్రి పదవి రావడం వెనక మధిర ప్రజల సహకారం, అందించిన మద్దతు, చేసిన కృషి జీవితంలో మరవలేనని పేర్కొన్నారు… ఇదే సహకారం ముందు ముందు అందించాలని విజ్ఞప్తి చేశారు… మధిర అభివృద్ధి కోసం తన శాయశక్తిలా కృషి చేస్తానని. అనుకున్న విధంగా అన్ని అభివృద్ధి పనులను చేసి తీరుతానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఏ సమస్య ఉన్న తన దగ్గరకు వచ్చి చెప్పవచ్చునని ఎల్లప్పుడూ తన ద్వారాలు మధిర ప్రజల కోసం తెరిచి ఉంటాయన్నారు … నాలుగు పర్యాయాలుగా మధిర లో గెలిపించిన ప్రజలకు పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు..మధిర ప్రజల మేలు జీవితంలో మర్చిపోలేనన్నారు … గత 15 సంవత్సరాలు చేసిన సేవలు మీకు తెలుసు… ఇప్పుడు మరిన్ని సేవలు చేసే అవకాశం అదృష్టం దక్కింది… అందుకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని అన్నారు . ఎక్కడ ఏ సమస్య ఉన్నా అర్ధరాత్రి అపరాత్రి అనేది లేకుండా నాకు తెలియజేయాలని పేర్కొన్నారు . అంతే కాకుండా ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచన చేస్తామని అందుకు రాష్ట్ర బాధ్యతలతో పాటు మధిరలో ప్రధానంగా తన క్యాంప్ కార్యాలయంలో తగిన సిబ్బందిని నియమించి ప్రతి సమస్యను అడ్రస్ చేసేదిగా చేస్తానని అన్నారు …
రాష్ట్ర ఆర్థిక, ఇంధన, ప్రణాళిక శాఖల బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి, మధిర ప్రజలు తలెత్తుకునే విధంగా పరిపాలన చేస్తానని హామీ ఇచ్చారు. 10 ఏండ్లు పరిపాలన చేసిన గత బిఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి అధోగతి పాలు చేసిందన్నారు. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుంచి గట్టెక్కించి, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి పని చేస్తానని అన్నారు. గత
బి ఆర్ ఎస్ ప్రభుత్వం నిర్వాకం వల్ల 1.10 లక్షల కోట్ల రూపాయల రుణాలతో ఉన్న విద్యుత్ రంగాన్ని కాపాడుకోవడంతో పాటు థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి ప్రత్యామ్నాయంగా విద్యుత్ ఉత్పత్తి చేయడానికి కావలసిన మార్గాలు అన్వేషణ చేస్తున్నట్లు చెప్పారు. సింగరేణి బొగ్గు గనుల సంస్థను బతికించుకొని వేలాది ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. గత ప్రభుత్వ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి, అప్పుల ఊబిలోకి నెట్టినప్పటికీ ఉద్యోగులకు రెండవ తారీఖున జీతాలు ఇచ్చిన ప్రభుత్వం తమదన్నారు. రాష్ట్ర అప్పుల పాలైనప్పటికీ తెలంగాణ ప్రజల కలలు నిజం చేయడానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చిన వాటిని అధిగమించి సంపద సృష్టించి ప్రజలకు పంచడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యమన్నారు. రాష్ట్రంలోని సహజ వనరులు, ఇతను వనరులను రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే విధంగా పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్లి సంపద సృష్టించి సృష్టించిన సంపదను ప్రజలకు పంచడమే ఆరు గ్యారంటీల హామీల అమలు లక్ష్యమని వివరించారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి నిష్ణాతులతో మాట్లాడడానికి తనకు ఎలాంటి భేషజాలాలు లేవని, రాజ్యాంగం, ఫెడరలిజం స్ఫూర్తితో రాష్ట్రానికి రావలసిన ఆదాయ వనరులను కేంద్రం నుంచి రాబట్టుకోవడానికి ముందుకు వెళ్తామన్నారు. రాష్ట్ర విభజన చట్టాల హామీలు అమలు కోసం కేంద్రానికి విన్న విస్తామని ఇందులో ఎలాంటి
భేషజాలాలకు పోమన్నారు. ఎన్నికల అప్పుడే రాజకీయాలు తప్పా.., ఇప్పుడు పాలన, అభివృద్ధి తమకు ముఖ్యమన్నారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం అందరి సమిష్టి బాధ్యత అని గుర్తు చేశారు. ప్రభుత్వంలోని ప్రతి వ్యవస్థ నా కోసమే ఏర్పాటు చేశారని ప్రతి పౌరుడు అనుకోవాలని, ఆ దిశగా తమ పరిపాలన సాగుతుందని వివరించారు.
తెలంగాణలో అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా నిండని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో వైఫల్యం చెందారని బి ఆర్ ఎస్ నాయకులు విమర్శలు చేయడం అవివేకమన్నారు. పది సంవత్సరాలు అధికారంలో ఉండి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేని నాటీ అసమర్ధ బిఆర్ఎస్ నాయకుల మాటలు వింటుంటే నవ్వాలా? ఏడ్వాలా? అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా మా పార్టీ కండువాలు వేసుకుంటేనే మా పార్టీ జెండాలు పట్టుకుంటేనే ఆరు గ్యారెంటీలు ఇస్తామని చెప్పమని, ఆరు గ్యారెంటీలను రాజకీయాలకు అతీతంగా అందరికీ ఇవ్వడమే ఇందిరమ్మ ప్రజాపాలన లక్ష్యం అని వివరించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల హామీలను లబ్ధి పొందే విధంగా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందని దిశా నిర్దేశం చేశారు.
మధిర అంటే నాకు ప్రాణం
రాజకీయంగా జన్మనిచ్చినటువంటి మధిర నియోజకవర్గం అంటే నాకు ప్రాణమని ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచించి పని చేస్తానని భట్టి విక్రమార్క చెప్పారు.
ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పీపుల్స్ మార్చ్ పేరిట చేసిన పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది అంటే మధిర ప్రజలు ఇచ్చిన శక్తి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడానికి ఉపయోగపడింది అన్నారు. బిఆర్ఎస్ పాలనలో ఎటువంటి ఒత్తిడిలకు లొంగకుండా, వేదింపులకు, బెదిరింపులకు భయపడకుండా పది సంవత్సరాలు కడుపులో పెట్టుకొని చూసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పారు. మధిర అభివృద్ధి కోసం ఓట్లు వేసి ఆశీర్వదించిన పెద్దలకు, మొట్ట మొదటిసారి ఓటు వచ్చి అభివృద్ధికే పట్టం కట్టిన యువతీ యువకులు అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలిపారు. రాబోయే ఐదు సంవత్సరాలలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి కావలసిన ప్రణాళికలు తయారుచేసి నియోజకవర్గం లో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానని చెప్పారు. భూమి లేకుండా రెక్కల కష్టం మీద ఆధారపడి బతుకుతున్న పేదల బిడ్డలు ఉన్నత చదువులు చదువుకోవడానికి పునాదులు వేస్తానని వివరించారు. నియోజకవర్గంలో చదువుకున్న బిడ్డలకు ఉపాధి కల్పించడానికి పరిశ్రమల ఏర్పాటుకు నాంది పలికినట్లు వివరించారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి వాటిని పారిశ్రామిక వాడలుగా మార్చుతున్నట్లు చెప్పారు. నిరుద్యోగ యువతీ యువకులు పరిశ్రమలు పెట్టుకునే విధంగా ప్రోత్సహిస్తానని ఇతర ప్రాంతాల పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు మధిర నియోజకవర్గాన్ని హెల్త్ హబ్బుగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ప్రతి మండలంలో ఇంగ్లీష్ మీడియం లో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు కోసం స్థల సేకరణ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. తెలంగాణ ప్రజలు పెట్టుకున్న కలలను నిజం చేయడంతో పాటు వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కంకణ బద్ధులమై పనిచేస్తామని హామీ ఇచ్చారు.
Grand welcome to Deputy CM Bhatti Vikramarka in Madira..
Bhatti’s arrival, the people are confused
Treat the couple with gifts
Fans showered with flowers
On the occasion of Mallu Bhatti Vikramarka, the Deputy Chief Minister of the state, coming to Madira for the first time, the people of Madhiralopattanam welcomed the Congress Party workers in a big way… People waited for the arrival of their favorite leader like never before… The Deputy CM, who participated in various development programs in Errupalem mandal, reached Madira in the afternoon.. People showered flowers on a large scale… Bhatti and his co-worker Nandini were honored with garlands… A big crane was used for this… Many said that it was beautiful to see their favorite leader Deputy CM Ayuna coming to Madhira for the first time…
Addressing the people on this occasion, Bhatti said that the support, support and efforts of the people of Madhira after getting the post of Deputy Chief Minister will never be forgotten in his life… He appealed to them to provide the same support first… He will work to the best of his ability for the development of Madhira. He assured the people that all development works will be done as planned. He said that his doors are always open for the people of Madhira that they can come to him and tell them about any problem… He thanked the people who won Madhira for four terms by name. He said that he will adhere to the development of the constituency accordingly. Wherever there is any problem, he told me to let me know without delay. Apart from that, he said that he will think towards solving people’s problems from time to time and for that he will appoint appropriate staff in his camp office mainly in Madhira to address every problem.
Deputy CM Bhatti Vikramarka said that he will work as a servant of the people in the kingdom of Indiramma without getting tired of the power given by the people and will save the state from debt. On Saturday night, Deputy CM Bhatti Vikramarka along with his wife Nandini Vikramarka attended the civic honor program organized under the auspices of Congress Party Mandal Committee in front of Reddy Garden in Madhira Constituency Centre. On this occasion, the party leaders of the respective political parties covered themselves with shawls and garlanded them. In the program organized on this occasion, the party leaders made a long speech addressing the people. He assured that he would effectively handle the responsibilities of the state finance, energy and planning departments and administer the administration in such a way that Madhira people would arise. He said that the previous BRS government, which ruled for 10 years, took a debt of 7 lakh crores of rupees and pushed the state into a mire of debt. He said that he will work to get this state, which is suffering from financial crisis, out of debt and put the economy in a groove. the past
He said that the BRS government is looking for ways to generate electricity as an alternative to thermal power generation in addition to saving the power sector, which has a debt of Rs 1.10 lakh crore due to the administration. They said that the Singareni Coal Mines Company will survive and provide thousands of jobs. They said that the government that gave salaries to the employees on the second date despite emptying the state treasury of the previous government and plunging them into the abyss of debt is theirs. The Indiramma Rajyaam said that the goal of the state is to create wealth and distribute it to the people by overcoming all the financial difficulties to make the dreams of the people of Telangana come true despite the debts of the state. Natural resources of the state, he explained that the goal of implementation of the six guarantees is to go ahead with solid plans to contribute to the development of the state and distribute the wealth created to the people. He said that he does not have any idioms to talk to the experts to put the economy in a groove, he said that he will go ahead to get the sources of income from the center in the spirit of the constitution and federalism. This does not mean that the Center will be asked to implement the guarantees of state partition laws
No profanity. The politics of the election was wrong, now governance and development are important to them. He reminded that the development of this state is the collective responsibility of all. He explained that every citizen should think that every system of the government has been set up for me, and their administration will go in that direction.
The BRS leaders said it was foolish to criticize the Congress government for failing to implement the six guarantees announced by the Congress government less than a month after coming to power in Telangana. Should we laugh when we listen to the words of incompetent BRS leaders who cannot give double bedroom houses after being in power for ten years? cry They protested that they did not understand. Like the previous BRS government, if our party wears scarves and holds our party flags, we will give six guarantees, he explained that the aim of Indiramma’s public administration is to give six guarantees to everyone regardless of politics. The Congress workers were directed to ensure that every eligible person gets the benefit of the six guarantees announced by the Congress.
Madhira means life to me
Bhatti Vikramarka said that Madhira Constituency, which gave birth politically, is my life and will constantly think and work for the development of this constituency.
He said that the Congress created a sensation in the state through the Padayatra called People’s March from Adilabad to Khammam, which means that the power given by Madhira people was useful in bringing the Congress to power. On this occasion, he thanked everyone who had endured ten years under the BRS regime without succumbing to any pressure, harassment and threats. To the elders who voted for the development of Madhira and blessed them, the young men and women who voted for the development for the first time bowed their heads and saluted them all. He said that in the next five years, necessary plans will be prepared to strengthen the agricultural sector and agriculture related industries will be brought and developed in the constituency. He explained that he will lay foundations for the children of the poor who live without land and depend on the difficulty of their wings to study higher education. It was explained that the establishment of industries to provide employment to the educated children in the constituency was initiated. He said that vacant government lands in the constituency have already been identified and converted into industrial use. He said that he would encourage unemployed young men and women to set up industries and would invite entrepreneurs from other areas and work hard to set up industries. Along with developing the industrial sector, Madhira constituency will be made a health hub.