Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

లోక్ సభ ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉంటుంది: కేటీఆర్

  • నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంపై బీఆర్ఎస్ సన్నాహక సమావేశం
  • గట్టిగా పోరాడితేనే విజయం సాధించగలమన్న కేటీఆర్
  • ఎన్నికల్లో గెలవడం కోసం కాంగ్రెస్ అడ్డగోలు హామీలిచ్చిందని మండిపాటు

లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో త్రిముఖ పోరు ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గట్టిగా పోరాడితేనే విజయం సాధించగలమని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదని… 420 హామీలని ఎద్దేవా చేశారు. హామీలను నెరవేర్చలేక… అప్పులు, శ్వేతపత్రాలు అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఇప్పటికే గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసిందని చెప్పారు. ఎన్నికల్లో గెలిచేందుకు అడ్డగోలు హామీలు ఇచ్చారని దుయ్యబట్టారు. నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంపై ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.

Related posts

గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపిన తెలంగాణ కేబినెట్

Ram Narayana

అసెంబ్లీలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. రాష్ట్రాన్ని సంపదతో ఇస్తే అప్పులకుప్పగా మార్చారంటూ కేటీఆర్‌పై విరుచుకుపడిన భట్టి

Ram Narayana

 ఉమ్మడి పాలనలో అన్యాయం జరుగుతోందనే తెలంగాణ తెచ్చుకున్నాం: పొన్నం ప్రభాకర్

Ram Narayana

Leave a Comment