ప్రతిపక్షాలు అవాకులు చవాకులు పేలడం మానుకోవాలి…మంత్రి పొంగులేటి
ఆరు గ్యారంటీలు 100 రోజుల్లో అమలు… 40 రోజుల్లోనే హామీలను అమలు చేస్తామని ఎక్కడా చెప్పలేదు..
ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన హామీలకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది
అభయహస్తం పేరిట అర్హుల నుంచి దరఖాస్తులకు ఆహ్వానం
గ్యారెంటీల అమలుకు డిప్యూటీ సీఎం నేతృత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీ
తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన విధంగా చేసి తీరతామని రాష్ట్ర సమాచార , రెవిన్యూ , గ్రహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు …ఈమేరకు సోమవారం రాష్ట్ర సచివాలయంలోని మీడియా సెంటర్ లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చి నెలరోజులు అయిందో లేదో తాము వాగ్దానాలు అమలు చేయలేదని అవాకులు చెవాకులు పేలుతున్నారని అది వారు మానుకోవాలని హితవు పలికారు … డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వ తేదీవరకు ప్రజాపాలనలో అభయహస్తం దరఖాస్తులను స్వీకరించమని దానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని అన్నారు .. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపు కుంటున్నామని పేర్కొన్నారు … అభయహస్తం కోసం ఇప్పటివరకు 1.25 కోట్ల దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. వాటిలో భూ సమస్యల పరిష్కారం, రేషన్ కార్డుల కోసం 20 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.
గ్యారెంటీలను ఇప్పటికిప్పుడే అమలు చేయాలని నిలదీయడం సరికాదని పొంగులేటి అభిప్రాయపడ్డారు. 40 రోజుల్లోనే అమలు చేస్తామని తాము ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. 100 రోజుల్లో అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పారు.ఈ నెల 25వ నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తులను ఆన్ లైన్ చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు …ప్రతి దరఖాస్తు పరిశీలన కోసం ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుందని మంత్రి అన్నారు ..దరఖాస్తులకు ఆధార్ ,రేషన్ కార్డు లింక్ చేయడం జరుగుతుందన్నారు…
వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు డిప్యూటీ సీఎం నేతృత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీ
వచ్చిన దరఖాస్తుల పరిశీలన, నిజమైన లబ్ది దారుల ఎంపిక కోసం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చైర్మన్ గా క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని పొంగులేటి తెలిపారు …కమిటీ లో తనతోపాటు ,దుద్దిళ్ల శ్రీధర్ బాబు , పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ఉంటారని అన్నారు ..
ఓపిక పట్టండి …నెల రోజులు కాకముందే అధికారం లాక్కోవాలని ప్రతిపక్ష పార్టీ ఉవ్విళ్లురుతుంది .వంద రోజుల వరుకు ఆగకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఎలా ..మీరు చేసిన నిర్వాహకం వల్ల ఖజానా ఖాళీ అయింది …దాన్ని గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాం …మీ బండారం ఒక్కొక్కటి బయట పెడతాం తొందర ఎందుకు అని బీఆర్ యస్ నేతలకు పొంగులేటి చురకలు అంటించారు …
డేటా ఎంట్రీ తరువాత కేబినెట్ , అలాగే సబ్ కమిటీ లో చర్చలు జరిపి విధివిధానాలు అర్హులను ప్రకటిస్తామన్నారు …85లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి…ఒక కోటి 5లక్షల దరఖాస్తులు వచ్చాయి…. అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉందని అన్నారు …మీడియా సమావేశంలో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ , ఎమ్మెల్యేలు పాల్గొన్నారు …