- టలౌడ్ ద్వీపంలో 6.7 తీవ్రతతో భూకంపం
- భూమికి 80 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం
- న్యూ ఇయర్ రోజున జపాన్‌లో పెను నష్టం కలిగించిన భూకంపం
ఇటీవల తరచూ సంభవిస్తున్న భూకంపాలతో అతలాకుతలం అవుతున్న ఇండోనేషియాను భూకంపం మరోమారు కుదిపేసింది. టలౌడ్ ద్వీపంలో ఈ ఉదయం 6.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ కారణంగా సంభవించిన ఆస్తి, ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. జాతీయ భూకంప కేంద్రం (ఎన్‌సీఎస్) ప్రకారం భూకంపం భూమి ఉపరితలానికి 80 కిలోమీటర్ల లోతులో సంభవించింది.
ఇదిలావుంచితే, నూతన సంవత్సరం ప్రారంభం రోజున జపాన్‌లో 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపం పెను నష్టాన్ని కలిగించిన సంగతి తెలిసిందే. దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోగా, 200 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. గత ఎనిమిదేళ్లలో జపాన్‌లో సంభవించిన భారీ భూకంపాల్లో ఇదొకటి.