Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

రాష్ట్రమంత్రులు పొంగులేటి,,తుమ్మల ఖమ్మం జిల్లా పర్యటన….

రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణం మాచర్ల శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ, మార్కటింగ్ ,కో -ఆపరేటివ్ ,జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , బుధ వారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు … తుమ్మల పర్యటన జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి ప్రకటించగా ,పొంగులేటి పర్యటనను కార్యాలయం ఇన్చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ప్రకటించారు… పొంగులేటి ఉదయం 9 .15 గంటలకు పోలేపల్లి లోని గురుదక్షణ పౌండేషన్ ను సందర్శిస్తారు … ఉదయం 10 గంటలకు ఖమ్మం లో భక్త రామదాసు కళాక్షేత్రంలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు… అక్కడ ఆయనకు అభినందన సత్కార సభ ఏర్పాటు చేశారు… అక్కడ నుంచి ఖమ్మం రూరల్ మండలంలోని మల్లెమడుగు , ఏదులాపురం , కొండాపురం గ్రామాల్లో నూతనంగా నిర్మించిన హెల్త్ సబ్ సెంటర్లును మంత్రి ప్రారంభిస్తారు…

మధ్యాహ్నం తుమ్మల ,పొంగులేటి లు కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలుసుకుంటారు…. పొంగులేటి మధ్యాహ్నం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంకు మొదటిసారిగా అయిన వెళ్తున్నారు… ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత క్యాంప్ కార్యాలయానికి మొదటిసారిగా రానున్న సందర్భంగా నియోజకవర్గ ప్రజలు భారీ సంఖ్యలో ఎక్కడికి చేరుకునే అవకాశం ఉంది… దీంతో ముందు జాగ్రత్తగా పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు … పొంగులేటి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గం వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వయించనున్నారు … పెండింగ్ లో ఉన్న సమస్యలు, ఇంకా ప్రారంభం కానీ సమస్యలు, వాటి పురోగతి , చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు గురించి సవివరంగా అధికారుల నుండి వివరాలు సేకరిస్తారు… తర్వాత ఆయన ఏ కార్యక్రమా ల ప్రాధాన్యత ఇవ్వాలనేది నిర్ణయించుకుని వాటి ప్రకారం అధికారులు తగిన ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది… అందుకోసం అధికారులు సైతం అన్ని మండలాల నుంచి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి కూసుమంచి చేరుకుంటారు …

Related posts

హాట్టహాసంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలకు సిద్ధం

Ram Narayana

ఇందిరమ్మ రాజ్యం కావాలా…ఫామ్ హౌస్ లో గడిపే ముఖ్యమంత్రి కావాలా పొంగులేటి!

Ram Narayana

అధిష్టానం వద్ద ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ పంచాయతీ…

Ram Narayana

Leave a Comment