Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఏపీలో సీనియర్ రెసిడెంట్ వైద్యుల స్టైపెండ్ రూ. 70 వేలకు పెంపు…

ఏపీలో సీనియర్ రెసిడెంట్ వైద్యుల స్టైపెండ్ రూ. 70 వేలకు పెంపు…
-ప్రస్తుతం రూ. 45 వేలుగా ఉన్న స్టైపెండ్
-కొవిడ్ నేపథ్యంలో ఆందోళన విరమించాలని కోరిన సింఘాల్
-రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో బెడ్ల ఖాళీలు పెరుగుతున్నాయన్న అనిల్ కుమార్

ఆంధ్రప్రదేశ్‌లో సీనియర్ రెసిడెంట్ వైద్యుల స్టైపెండ్ ‌ను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కారద్యర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ప్రస్తుతం రూ. 45 వేలుగా ఉన్న స్టైపెండ్ ‌ను రూ. 70 వేలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ప్రస్తుతం కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆందోళన సరికాదని, విరమించాలని కోరారు.

అలాగే, వ్యాక్సినేషన్ విషయంలో విదేశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రాష్ట్రంలోని కొవిడ్ ఆసుపత్రులు, కేంద్రాల్లో బెడ్ల ఖాళీల సంఖ్య పెరుగుతోందన్నారు. అలాగే డిశ్చార్జ్‌లు కూడా పెరుగుతున్నట్టు చెప్పారు.

విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు, ఉద్యోగులు తమ పాస్‌పోర్టు నంబరు కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కొవిన్ యాప్‌లో ప్రస్తుతం ఈ సదుపాయం అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయని, ఈ సమస్యను సవరించేందుకు కేంద్రానికి లేఖ రాశామని సింఘాల్ తెలిపారు.

Related posts

తల్లి అంత్యక్రియల కోసం పోటీపడిన హిందూ కుమారుడు, ముస్లిం కుమార్తె…

Drukpadam

మొదటిసారి ప్రధానిని కలిసిన తమిళనాడు సీఎం స్టాలిన్ …

Drukpadam

ఐజేయి సమావేశాలకు ఆంధ్ర,తెలంగాణ ప్రతినిధులు…

Drukpadam

Leave a Comment